Mithun Reddy : ఏపీలో ముందస్తు ఎన్నికలు..! వైసీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు వ్యాఖ్యలతో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉంటాయా? జగన్ ప్రభుత్వం వైఖరి ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తాయి.

Mithun Reddy

Mithun Reddy : ఏపీలో ముందస్తు ఎన్నికల అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో హీట్ పెంచింది. ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన చర్చకు దారితీసింది. చంద్రబాబు వ్యాఖ్యలతో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉంటాయా? జగన్ ప్రభుత్వం వైఖరి ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తాయి.

కాగా, చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటూ తాము అధికారంలో ఉంటామని తెలిపారు. పార్టీని కాపాడుకునేందుకే చంద్రబాబు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని మిథున్ రెడ్డి విమర్శించారు. తిరుపతిలో ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Covid Restrictions In Bengal : రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు, సెలూన్లు మూసివేత.. ఉ.10 నుంచి సా.5 వరకే నిత్యవసర సేవలు

2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మళ్లీ 2024లో ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. అయితే, దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరపాలంటూ ప్రధాని మోదీ అభిలషిస్తున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ముందుగానే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

WhatsApp Scam : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు మాయం

శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చంద్రబాబు ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందని ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే.. ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు చెప్పారు. దాంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి.