Bengal : రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు, సెలూన్లు బంద్.. ఉ.10 నుంచి సా.5 వరకే షాపులు

సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జంతు ప్రదర్శన శాలలు, వినోద ఉద్యానవనాలు మూసివేయనున్నారు. ఇక నిత్యావసర సేవలకు ఉదయం 10 నుంచి..

Bengal : రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు, సెలూన్లు బంద్.. ఉ.10 నుంచి సా.5 వరకే షాపులు

Covid Restrictions In Bengal

Covid Restrictions In Bengal : రోజురోజుకి కరోనా కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణుకు పుట్టిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కొత్త కేసుల సంఖ్య పెరిగింది.

విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కరోనా ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. సోమవారం (జనవరి 3) నుంచి స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జంతు ప్రదర్శన శాలలు, వినోద ఉద్యానవనాలు బెంగాల్ లో మూసివేయనున్నారు. ఇక నిత్యావసర సేవలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

WhatsApp Scam : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు మాయం

తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో 50శాతం సిబ్బందితోనే పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, కోల్ కతా నుంచి ఢిల్లీ, ముంబై నగరాలకు మాత్రమే విమాన సర్వీసులు పరిమితం చేశారు. అదీ సోమ, మంగళ వారాల్లోనే విమాన సర్వీసులు నడపనున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటలకు నైట్ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. షాపింగ్స్ మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్ లు, రెస్టారెంట్లు, బార్లపైనా ఆంక్షలు పెట్టింది ప్రభుత్వం. 50శాతం సీటింగ్ తోనే నడిపించుకోవాలని ఆదేశించింది.

* జనవరి 3 నుంచి మూతపడనున్న స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్పాలు, సెలూన్లు, బ్యాటీ పార్లర్లు, స్విమ్మింగ్ పూల్స్, జూ పార్కులు, ఎంటర్ టైన్ మెంట్ పార్కులు.
* అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు 50శాతం సిబ్బందితోనే నిర్వహణ. పాలనాపరమైన భేటీలను వర్చువల్ మోడ్ లో నిర్వహించాలి.
* సాయంత్రం 7 గంటల వరకే అందుబాటులో లోకల్ రైళ్లు. అదీ 50 శాతం సీటింగ్ తో నడపాలి.
* రాష్ట్రంలోని అన్ని టూరిస్టు ప్లేసులు మూసివేత.

Heart Disease : గుండె జబ్బులు రాకుండా నివారించటం ఎలాగంటే

* మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు 50 మందికి మాత్రమే అనుమతి.
* షాపింగ్ మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్‌లు తమ సామర్థ్యంలో 50 శాతానికి మించకుండా వ్యక్తులను లోనికి అనుమతించాలి. రాత్రి 10వరకే అనుమతి.
* రెస్టారెంట్లు, బార్‌లు 50శాతం సామర్థ్యంతో నడుపుకోవాలి. రాత్రి 10 వరకే అనుమతి. సినిమా హాళ్లు, థియేటర్లకు అవే పరిమితులు, సమయాలు
వర్తిస్తాయి.
* సభలు, సమావేశాలకు 200 మందికే అనుమతి. లేదా హాలులో సగం సీటింగ్ కు మాత్రమే అనుమతి.
* పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు 50 మందికే అనుమతి.
* అంత్యక్రియలకు 20 మందికి మించి అనుమతి లేదు.
* కోల్ కతా మెట్రో సర్వీసులు 50శాతం కెపాసిటీతో రన్ చేయాలి.
* రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటలకు నైట్ కర్ఫ్యూ. ఆ సమయంలో ప్రజలు, వాహనాల రాకపోకలు, బహిరంగ సభలపై నిషేధం. అవసరమైన, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది.