Srikakulam Earthquake
Srikakulam Earthquake : శ్రీకాకుళం జిల్లాలో స్వల్పంగా భూకంపం సంభవించింది. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లో మంగళవారం(జనవరి 4) రాత్రి భూమి కంపించింది. గత వారం రోజుల్లో ఇది రెండోసారి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Corona New Variant IHU : కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే డేంజర్…?
రత్తకర్ణ, తేలుకుంచి, అమీన్‌సాహిబ్ పేట, పురుషోత్తపురం గ్రామాల్లో, ఇచ్ఛాపురం సమీప ఒడిశా ప్రాంతంల్లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూమి మూడుసార్లు కంపించింది. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. ఇళ్ల నుంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. కొందరు భయంతో నిద్ర కూడా మానుకున్నారు. ఇంటి బయటే గడుపుతున్నారు.