జనసేనాని పవన్ కల్యాణ్‌కు ఈసీ నోటీసులు.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం

దీనిపై స్పందించిన సీఈవో.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇచ్చారు.

Pawan Kalyan

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 7న అనకాపల్లి బహిరంగ సభలో సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు కంప్లైంట్ చేశారు. దీనిపై స్పందించిన సీఈవో.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇచ్చారు.

టీడీపీ నేతలపైనా ఫిర్యాదు
చంద్రబాబు, వర్ల రామయ్య, అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ఈసీకి వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఈసీ నోటీసులిచ్చిన తర్వాత కూడా చంద్రబాబు కామెంట్లల్లో మార్పు లేదని సీఎం జగన్ను ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్లు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జరుగు జగన్.. జరుగు జగన్ అనే పేరుతో టీడీపీ ఓ పాటను రూపొందిస్తోందని తెలిపారు. సీఎం జగన్ను కించపరిచే విధంగా మాటలు.. పాటలు పాడుతున్నారు. వర్ల రామయ్య, అయ్యన్నపాత్రుడు వంటి వారు కూడా సీఎం జగన్ను కించపరిచే విధంగా కామెంట్లు చేస్తున్నారని అన్నారు.

అజ్ఞాత రాజకీయ హోర్డింగ్‌లపై ఈసీఐ కొరడా
మరోవైపు పేరు లేని అజ్ఞాత రాజకీయ హోర్డింగ్‌లపై ఈసీఐ కొరడా ఝళిపించింది. గుర్తించదగిన, జవాబుదారీతనాన్ని నిర్ధారించేందుకు పబ్లిషర్ల, ప్రింటర్ల వివరాలను బహిర్గతం చేయాలని ఆదేశించారు సీఈవో ముఖేశ్ కుమార్ మీనా. ప్రచురణకర్తల గుర్తింపును బహిర్గతం చేయడం ప్రచార ఫైనాన్సింగ్ అకౌంటింగ్ ను నియంత్రిస్తుందన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 127A నిబంధనలకు అధికారులు కచ్చితంగా కట్టుబడాలని స్పష్టం చేశారు.

Also Read : ఆ పార్టీకి పవన్ కల్యాణ్ పెద్ద కోవర్ట్: పోతిన మహేశ్