వాలంటీర్లకు ఎన్నికల విధులు.. ఈసీ కీలక ఆదేశాలు

ఈ మేరకు సీఈసీ ఇచ్చిన ఆదేశాలను జిల్లాల కలెక్టర్లకు పంపారు ఏపీ సీఈవో మీనా.

Election Commission

Election Commission : సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు ఎన్నికల విధులపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించొద్దని చెప్పింది. ఇక సచివాలయ సిబ్బందికి ఇంకు పూసే పని ఇవ్వాలంది. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల విధులపై జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు సీఈవో. సీఈసీ ఆదేశాల మేరకు వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించొద్దన్నారు. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లు అనుమతించొద్దని ఏపీ సీఈవో చెప్పారు.

అయితే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఎన్నికల విధుల అప్పగింతపై అభ్యంతరం లేదన్నారు ఏపీ సీఈవో. ఓటర్లకు ఇంకు చుక్కలు పెట్టడం లాంటి చిన్న బాధ్యతలు అప్పగించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి.. కీలకమైన ఎన్నికల బాధ్యతలు అప్పగించొద్దని ఏపీ సీఈవో చెప్పారు. ఈ మేరకు సీఈసీ ఇచ్చిన ఆదేశాలను జిల్లాల కలెక్టర్లకు పంపారు ఏపీ సీఈవో మీనా.

వాలంటీర్లకు ఎన్నికల విధులపై జిల్లా కలెక్టర్లకు ఏపీ సీఈవో (రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి) ముఖేష్ కుమార్ మీనా సూచనలు..
* గ్రామ/ వార్డు వాలంటీర్లకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎన్నికల సంబంధిత విధులు అప్పగించవద్దని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చిన ఈసీఐ
* అభ్యర్ధులకు పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లను అనుమతించవద్దని తేల్చి చెప్పిన ఈసీఐ
* కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించేందుకు అభ్యంతరం లేదు
* అర్హులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పోలింగ్ టీం ఉంచి సార్వత్రిక ఎన్నికల్లో విధులు అప్పగించొచ్చు
* ఎన్నికలకు సంబంధించి ప్రధాన విధులు వారికి అప్పగించొద్దని గతంలో స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
* ఓటర్లకు ఇంకు రాసే పనుల లాంటి విధులు మాత్రమే అప్పగించాల్సిందిగా ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం
* ప్రతీ పోలింగ్ టీంలో అర్హులైన ఒక రెగ్యులర్ గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగిని నియమించుకోవచ్చని స్పష్టం
* బీఎల్ఓలుగా వ్యవహరించిన గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బందిని పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని తేల్చి చెప్పిన ఈసీఐ
* బీఎల్ఓలకు పోలింగ్ రోజున వారికి ఎన్నికల విధులు కాకుండా ఇతర విధులు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం

ట్రెండింగ్ వార్తలు