Election Commission : డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణాపై ఈసీ బదిలీ వేటు!

విధుల నుంచి వైదొలిగే సమయంలో దిగువ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఆంజనేయులు, కాంతి రాణాను ఎన్నికల సంఘం ఆదేశించింది.

Election Commission : ఏపీలో సీఎం జగన్‌పై దాడి సంఘటన నేపథ్యంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఈసీ వేటు వేసింది. ఏపీ ఇంటిటలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతి రాణాలను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

కాంతిరాణాను వెంటనే రిలీవ్ చేయాలని ఈసీ ఆదేశించింది. తక్షణమే వారిని విధుల నుంచి తప్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికలతో సంబంధం లేని విధులు వారికి అప్పగించాలని ఆదేశాలను జారీ చేసింది.

బుధవారం (ఏప్రిల్ 24) మధ్యాహ్నం 3 గంటల్లోగా వారి స్థానాల్లో అధికారులను నియమించేందుకు వీలుగా ముగ్గురేసి చొప్పున అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్‌ను పంపాలని ఈసీ సూచించింది. సదరు అధికారుల వార్షిక పనితీరు నివేదిక ఆధారంగా పేర్లు సూచించాలని స్ఫష్టం చేసింది. విధుల నుంచి వైదొలిగే సమయంలో దిగువ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఆంజనేయులు, కాంతి రాణాను ఎన్నికల సంఘం ఆదేశించింది.

Read Also : KTR Comments : చట్ట సభలకు పంపితే.. కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చీల్చాడు : కేటీఆర్

ట్రెండింగ్ వార్తలు