SIR Telugu States: తెలుగు రాష్ట్రాల ఓటర్లకు బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో ఎస్ఐఆర్.. ఎప్పటి నుంచి అంటే..
SIR Phase 3: మూడో దశలో 3 లక్షల 94వేల మందికిపైగా బూత్ స్థాయి అధికారులు పని చేయబోతున్నారు. వీరంతా 36 కోట్ల 73 లక్షల మంది ఓటర్ల వద్దకు వెళ్లనున్నారు.
- Naveen
- Updated on- May 14, 2026 / 06:08 PM IST
Eci Schedule For Phase 3 Special Intensive Revision SIR
SIR: దేశంలో మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ షెడ్యూల్ ను (ఎస్ఐఆర్-స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఈసీ ప్రకటించింది. ఏపీ, తెలంగాణ సహా మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ చేపట్టబోతోంది ఈసీ. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒరిస్సా, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపుర మూడో దశలో ఉన్నాయి.
ఇక ఏపీలో జూన్ 5 నుంచి 14 వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు. జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి సిబ్బంది వివరాలు సేకరించబోతున్నారు. అనంతరం జూలై 21న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. ఇక జూలై 21 నుంచి ఆగస్ట్ 20 వరకు అభ్యంతరాలు స్వీకరించబోతున్నారు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ జాబితా ప్రకటిస్తారు.
ఇటు తెలంగాణలో జూన్ 15 నుంచి 24వ తేదీ వరకు సిబ్బందికి శిక్షణ తరగతులు ఉంటాయి. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే చేపడతారు. అనంతరం జూలై 31న ఓటర్ల ముసాయిదా ప్రకటించి అదే రోజు నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించబోతున్నారు. అక్టోబర్ 1న తుది ఓటర్ జాబితా ప్రకటించబోతున్నారు.
మొత్తంగా మూడో దశలో 3 లక్షల 94వేల మందికిపైగా బూత్ స్థాయి అధికారులు పని చేయబోతున్నారు. వీరంతా 36 కోట్ల 73 లక్షల మంది ఓటర్ల వద్దకు వెళ్లనున్నారు. డిసెంబర్ 23న త్రిపురతో మూడో దశ ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియబోతోంది. ఎస్ఐఆర్ కు సహకరించాలంటూ ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి కూడా చేసింది.
Also Read: వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్.. వారానికి 2 రోజులు.. ఒక రోజు నో కార్ డే.. ఇంకా..
