Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్.. వారానికి 2 రోజులు.. ఒక రోజు నో కార్ డే.. ఇంకా..
అధికారులకు కేటాయించే కార్లలో వినియోగించే పెట్రోల్ లో కూడా కోత పెట్టాలని నిర్ణయించారు. 20 శాతం ఆయిల్ బిల్ కట్ చేయనున్నారు.
Work From Home: ఇంధన పొదుపు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పలు రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయి. ఏపీలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అందరూ కాన్వాయ్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్లు, ఇతరత్రా చర్యలు ఏమేం తీసుకోవచ్చో చెప్పాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మోదీ చెప్పినట్టు పొదుపు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాజాగా ఢిల్లీలో ఈ చర్యలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ మేరకు చర్యలు మొదలు పెట్టారు.
ఉద్యోగులకు రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్..
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, మిగిలిన రోజుల్లో ఒక రోజు నో కార్ డే పాటించాలని ఆదేశించారు. దీన్ని మెట్రో డేగా పిలవనున్నారు. అంటే ఆ రోజు అందరూ మెట్రోలోనే ఆఫీసులకు రావాలన్నమాట. ఇక ఆఫీసు మీటింగ్స్ లో 50 శాతం వరకు ఆన్ లైన్ లోనే జరపాలని తీర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి తగినట్టే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూడా చర్యలు తీసుకోనుంది. ఉద్యోగులకు ఆఫీస్ టైమింగ్స్ మార్చనుంది. దీని వల్ల ట్రాఫిక్ కొంత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
పెట్రోల్ కోత..
అధికారులకు కేటాయించే కార్లలో వినియోగించే పెట్రోల్ లో కూడా కోత పెట్టాలని నిర్ణయించారు. 20 శాతం ఆయిల్ బిల్ కట్ చేయనున్నారు. ఏ అధికారికి అయినా సరే నెలకు 200 లీటర్ల కంటే ఎక్కువ పెట్రోల్ కేటాయించవద్దని ఆదేశాలు వెళ్లాయి. వచ్చే ఆరు నెలల వరకు ఎలాంటి వాహనాలు కొనకూడదని డిసైడ్ అయ్యింది ప్రభుత్వం. ప్రభుత్వ కాలనీల్లో ఉండే వారు ఆఫీసులకు చేరుకోవడానికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయనున్నారు. సుమారు 29 కాలనీల నుంచి 58 బస్సులు నడపనున్నారు. ఈ బస్సులు కాలనీలో స్టార్ట్ అయ్యి ఉద్యోగులను ఆఫీసుకు తీసుకొస్తాయి. ఆఫీసు అయిపోయాక మళ్లీ వాళ్ల కాలనీలో దింపేస్తాయి.
Also Read: ఇక నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్‌లు బంద్ కానున్నాయా..? క్లారిటీ ఇదే..
