YSRCP MP Mithun Reddy (Image Credit To Original Source)
Mithun Reddy: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసింది. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలకపాత్ర పోషించారని ఈడీ అనుమానిస్తోంది.
కాగా, ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయ్ సాయి రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని ఈడీ అందులో పేర్కొంది.
Also Read: ఆ రోజున విచారణకు రండి అంటూ ఏపీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఈ స్కామ్‌పై ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన సిట్‌కు లేఖ రాసిన ఈడీ వివరాలు తీసుకుంది. వాటి ఆధారంగా పలు కోణాల్లో విచారణ చేస్తోంది.
లిక్కర్ స్కామ్ కేసులో గత ఏడాది మేలో ఈడీ మనీలాండరింగ్ లా కింద అభియోగాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. గత ఏడాది సెప్టెంబరులో ఈడీ చేసిన సోదాల్లో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ స్కామ్‌లో పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. హవాలా లావాదేవీలు, మనీ లాండరింగ్ జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.