Tirupati Laddu (Image Credit To Original Source)
Tirupati Laddu: టీటీడీ కల్తీ లడ్డూ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. రూ.235 కోట్లు హవాలా మార్గాల్లో చేతులు మారినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన నివేదికపై ఈడీ ఆరా తీసింది. సిట్ నుంచి ఈడీ అధికారులు వివరాలు సేకరించారు.
ఎఫ్‌ఐఆర్‌తో పాటు 36 మంది నిందితుల సమాచారాన్ని, ఈ కేసులో అభియోగ పత్రాలు, ఇతర అంశాలను ఈడీ విశ్లేషించింది. త్వరలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్టు-ఈసీఐఆర్ రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: మేడారంలో కొనసాగుతున్న ట్రాఫిక్ కష్టాలు.. గంటల తరబడి ట్రాఫిక్‌లో భక్తులు
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలిపారంటూ వచ్చిన ఆరోపణలు కొన్ని నెలలుగా ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారని, నిబంధనలను మార్చేసి కల్తీ నెయ్యి కొనుగోళ్లు చేశారని విమర్శలు వచ్చాయి.