Rajya Sabha seats: ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు యాదవ్, ఆర్.కృష్ణయ్య తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేయడంతో వారి స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి.

దేశంలోని నాలుగు రాష్ట్రాల నుంచి ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు యాదవ్, ఆర్.కృష్ణయ్య తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేయడంతో వారి స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. అలాగే, సుజీత్ కుమార్ (ఒడిశా) జవహర్ సిర్కార్ (పశ్చిమ బెంగాల్) క్రిషన్ లాల్ పన్వార్ (హరియాణా) స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.

  • నోటిఫికేషన్ విడుదల: డిసెంబరు 3
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: డిసెంబర్ 10
  • అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: డిసెంబర్ 13
  • పోలింగ్ తేదీ: డిసెంబర్ 20 (అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు)

Rahul Gandhi: వారి గురించి ఎవరు మాట్లాడినా మైక్‌ ఆఫ్‌ అవుతోంది: రాహుల్ గాంధీ