Rahul Gandhi: వారి గురించి ఎవరు మాట్లాడినా మైక్ ఆఫ్ అవుతోంది: రాహుల్ గాంధీ
మోదీ రాజ్యాంగాన్ని చదవలేదని రాహుల్ గాంధీ అన్నారు.

Rahul Gandhi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇవాళ రాహుల్ గాంధీ ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘‘భారత్‌లో గత 3,000 ఏళ్లుగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, పేదల గురించి ఎవరు మాట్లాడినా మైక్ ఆఫ్ అవుతోంది. మైక్ ఆఫ్ కాగానే చాలా మంది వచ్చి నన్ను వెళ్లి కూర్చోమని చెప్పారు. కూర్చోను, నేను నిలబడతాను, మీ ఇష్టం వచ్చినట్లు మైక్ స్విచ్ ఆఫ్ చేయండి. ఇదిగో వెనుక రోహిత్ వేముల ఫొటో ఉంది, అతను మాట్లాడాలనుకున్నాడు.. కానీ, అతని గళాన్ని లాగేసుకున్నారు” అని రాహుల్ గాంధీ చెప్పారు.
“దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు నడుస్తున్న మార్గంలో వారిని ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డంగా ఓ గోడ (ఓ భావజాలం) ఉంది. దాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ బలపరుస్తున్నారు. ఆ గోడను బలహీనపర్చడానికి యూపీఏ అనేక చర్యలు తీసుకుందని మోదీకి తెలిసినప్పటికీ ఆ చర్యలను కొనసాగించలేదు” అని రాహుల్ గాంధీ చెప్పారు.
మోదీ రాజ్యాంగాన్ని చదవలేదని రాహుల్ అన్నారు. ఒకవేళ మోదీ రాజ్యాంగాన్ని చదివి ఉంటే ఇప్పుడు ఆయన చేస్తున్న పనులను చేయకుండా ఉండేవారని విమర్శించారు.
Pawan Kalyan: సమోసాల కోసం గత వైసీపీ సర్కారు రూ.9 కోట్లు ఖర్చు పెట్టింది: పవన్ కల్యాణ్