Pawan Kalyan: సమోసాల కోసం గత వైసీపీ సర్కారు రూ.9 కోట్లు ఖర్చు పెట్టింది: పవన్ కల్యాణ్
ఏపీలో హోం శాఖ, శాంతి భద్రతలు తన పరిధిలో లేవని తెలిపారు. తాను ఏం మాట్లాడినా బాధ్యతగా మాట్లాడాలని చెప్పారు.

Pawan Kalyan
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అదానీ వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
పోలీసులను వారి పని చేసుకోనివ్వాలని, తన పని తాను చేస్తానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీలో హోం శాఖ, శాంతి భద్రతలు తన పరిధిలో లేవని తెలిపారు. తాను ఏం మాట్లాడినా బాధ్యతగా మాట్లాడాలని చెప్పారు. మీడియా తనను అడిగిన ప్రశ్నలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
తనను ఇబ్బంది పెట్టిన వారిని ఎందుకు పట్టించుకోవట్లేదని మీడియా అడిగిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. గత ప్రభుత్వ పాలన బాధ్యతాయుతంగా జరగలేదని అన్నారు.
కాగా, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. పోలవరం, ఏపీలో నదుల అనుసంధానం సహా నీటి ప్రాజెక్టులపై చర్చించారు. అంతకుముందు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పవన్ కల్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి సంబంధించి పలు పర్యాటక అభివృద్ధి అంశాలపై చర్చించారు.
Priyanka Gandhi : ప్రియాంక గాంధీని కలిసి అభినందనలు తెలిపిన రేవంత్ రెడ్డి, భట్టి