Priyanka Gandhi : ప్రియాంక గాంధీని కలిసి అభినందనలు తెలిపిన రేవంత్ రెడ్డి, భట్టి
వయనాడ్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రియాంక గాంధీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు మర్యాదపూర్వకంగా కలిసి..

CM Revanth Reddy and Deputy CM Bhatti
CM Revanth Reddy: వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రియాంకకు మొత్తం 6,22,338 ఓట్లురాగా.. తన సమీప ప్రత్యర్థిపై 4,10,931 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వచ్చిన మెజార్టీ కంటే ప్రియాంక అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ప్రియాంక ఘన విజయం పట్ల కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
తాజాగా.. ప్రియాంక గాంధీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వయానాడ్ లో భారీ విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రియాంక గాంధీకి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు.
వయనాడ్ లోక్ సభ సభ్యురాలిగా…
అద్భుతమైన విజయాన్ని సాధించిన…
శ్రీమతి ప్రియాంక గాంధీని…
నేను, ఉపముఖ్యమంత్రి…
శ్రీ మల్లు భట్టీ విక్రమార్క…
మర్యాదపూర్వకంగా కలిసి…
అభినందించడం జరిగింది. pic.twitter.com/IaZd2k3JO6— Revanth Reddy (@revanth_anumula) November 26, 2024