Priyanka Gandhi: వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఘన విజయం.. తొలి ఎన్నికలోనే అన్న మెజార్టీని దాటేసిన చెల్లెలు

వయనాడ్ ప్రజలు ప్రియాంక గాంధీకి బ్రహ్మరథం పట్టారు. దీంతో ఎన్నికల ఫలితాల్లో భారీ మెజార్టీతో ఆమె విజయం సాధించారు.

Priyanka Gandhi: వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఘన విజయం.. తొలి ఎన్నికలోనే అన్న మెజార్టీని దాటేసిన చెల్లెలు

Priyanka Gandhi

Updated On : November 23, 2024 / 2:11 PM IST

వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రియాంక ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు. రౌండ్ రౌండ్ కు భారీ ఆధిక్యాన్ని కనబర్చిన ఆమె.. 4,04,619 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రియాంక గాంధీకి మొత్తం 6,12,020 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరీ నిలిచారు. ఆయనకు 2,07,401 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆమె 1,08,940 ఓట్లు సాధించారు.

Also Read: Eknath Shinde: మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు.. ఏక్‌నాథ్ షిండే ఏమన్నారంటే..

తాజా ఫలితాలను బట్టి చూస్తుంటే వయనాడ్ ప్రజలు ప్రియాంక గాంధీకి బ్రహ్మరథం పట్టారు. గత సార్వత్రి ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాహుల్ రాజీనామాతో ఉప ఎన్నిక రావడంతో ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల బరిలోకి దిగారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ప్రియాంక గాంధీకి ఇదే తొలిసారి. అయితే, తొలిసారి పోటీలోనే ప్రియాంక గాంధీ అన్న రాహుల్ గాంధీ మెజార్టీని బ్రేక్ చేశారు. తాజా విజయంతో ఆమె తొలిసారి వయనాడ్ ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెట్టనున్నారు.