Eknath Shinde: మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు.. ఏక్‌నాథ్ షిండే ఏమన్నారంటే..

మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తాజా ఫలితాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మాట్లాడారు.

Eknath Shinde: మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు.. ఏక్‌నాథ్ షిండే ఏమన్నారంటే..

Eknath Shinde

Updated On : November 23, 2024 / 12:56 PM IST

Maharashtra Election Results 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతోంది. ఎన్డీయే కూటమి అభ్యర్థులు 217 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొసాగుతుండగా.. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి అభ్యర్థులు 55 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలు ఉండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 మంది ఎమ్మెల్యేలు అవసరం. దీంతో ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. దీంతో మరోసారి మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి అధికార పీఠాన్ని అదిరోహించేందుకు మార్గం సుగమం అయింది.

Also Read: Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి హవా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

గెలుపు ఖాయం కావడంతో మహాయుతి కూటమి నేతలు సంబరాలు షురూ చేశారు. సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఇతర కీలక నేతల నివాసాలు, పార్టీ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు టపాసులు కాల్చుతూ, స్వీట్లు తినిపించుకుంటూ నృత్యాలతో సందడి చేశారు.

Also Read: Rahul Dravid : ఓ ప‌క్క‌ మెగా వేలం కోసం సీరియ‌స్ డిస్క‌ష్క‌న్‌.. ఉత్సాహాన్ని ఆపుకోలేక‌పోయిన ద్ర‌విడ్‌.. ‘ఎవ‌రు ఔట్’

మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తాజా ఫలితాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మాట్లాడారు. ఎన్డీయే కూటమి బంపర్ మెజార్టీ సాధించింది. మరుపురాని విజయాన్ని అందించారు. మహిళలు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు. మహిళలకే ఈ విజయం అంకితం. ఎన్డీయే కూటమి పనితీరుకు ఈ ఫలితాలు నిదర్శనం. భారీ విజయం అందించిన మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని షిండే అన్నారు.

అయితే, మరొసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అదిరోహించబోతున్నారా అని మీడియా ప్రశ్నించగా.. అంతిమ ఫలితాలు రానివ్వండి.. మేమంతా కలిసి ఎన్నికల్లో పోరాడిన విధంగానే.. మూడు పార్టీల నేతలు కూర్చొని నిర్ణయం తీసుకుంటామని షిండే అన్నారు.