Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి హవా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాతుండగా.. శిసేన (యుబిటి) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Sanjay Raut
Maharashtra Election Results 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో ఫలితాల్లో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతుంది. ఎన్డీయే కూటమి అభ్యర్థులు 217 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొసాగుతుండగా.. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి అభ్యర్థులు 55 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలు ఉండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 మంది ఎమ్మెల్యేలు అవసరం. దీంతో ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. దీంతో మరోసారి మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి అధికార పీఠాన్ని అదిరోహించేందుకు మార్గం సుగమం అవుతుంది.
Also Read: Priyanka Gandhi: వయనాడ్‌లో ప్రియాంక గాంధీ హవా.. రాహుల్ మెజార్టీని దాటేస్తుందా..?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాతుండగా.. ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజా తీర్పు కాదు.. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. శివసేన పార్టీని చీల్చిన ఏక్ నాథ్ షిండే పై, ఎన్సీపీ పార్టీని చీల్చిన అజిత్ పవార్ పై మహారాష్ట్ర ప్రజలకు తీవ్ర ఆగ్రహం ఉందని, వారు చేసిన మోసాన్ని మహారాష్ట్ర ప్రజలు ఎలా మరిచిపోతారని అన్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాకు స్పష్టమైన ఆధిక్యం వచ్చింది. ఇప్పుడెలా ఫలితాలు మారాయని సంజయ్ రౌత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.