Priyanka Gandhi: వయనాడ్‌లో ప్రియాంక గాంధీ హవా.. రాహుల్ మెజార్టీని దాటేస్తుందా..?

గత సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ స్థానం నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ 3,64,422 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన రాజీనామాతో ఉప ఎన్నిక రావడంతో ..

Priyanka Gandhi: వయనాడ్‌లో ప్రియాంక గాంధీ హవా.. రాహుల్ మెజార్టీని దాటేస్తుందా..?

Priyanka Gandhi

Updated On : November 23, 2024 / 11:02 AM IST

Wayanad Bypoll Results 2024: వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక జోరు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతుంది. రౌండ్ రౌండ్ కు భారీ ఆధిక్యాన్ని కనబరుస్తుంది. తాజా ఫలితాల ప్రకారం.. ప్రియాంక గాంధీ లక్షన్నర ఓట్లకుపైగా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరీ ఉండగా.. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.

Also Read: Priyanka Gandhi: వయనాడ్ ఫలితంపైనే అందరిచూపు.. ప్రియాంక మెజార్టీపై బెట్టింగ్‌లు

గత సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ స్థానం నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ 3,64,422 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన రాజీనామాతో ఉప ఎన్నిక రావడంతో ప్రియాంక గాంధీ వయనాడ్ స్థానం నుంచి పోటీ చేస్తుంది. తొలిసారి ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగింది. తొలి ఎన్నికల్లోనే భారీ మెజార్టీ దిశగా ఆమె దూసుకెళ్తుంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మెజార్టీని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

వయనాడ్ ఉపఎన్నికలో  మొత్తం 9.52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో సుమారు ఆరు లక్షల ఓట్లు ప్రియాంకకు వస్తాయని కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఫలితాల సరళిని బట్టి చూస్తుంటే ఆరు లక్షల కంటే ఎక్కువ ఓట్లు ప్రియాంకకు పోలయినట్లు అంచనా.