Rahul Dravid : ఓ పక్క మెగా వేలం కోసం సీరియస్ డిస్కష్కన్.. ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయిన ద్రవిడ్.. ‘ఎవరు ఔట్’
ఆదివారం (నవంబర్ 24)న జరగనున్న ఈ వేలం కోసం ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు జెడ్డాకు చేరుకున్నాయి.

IPL 2025 auction preparations Rahul Dravid cant resist keeps an eye on Perth Test
టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రయాణం ముగిసింది. ఆ తరువాత రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా నియమితులయ్యాడు. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. ఆదివారం (నవంబర్ 24)న జరగనున్న ఈ వేలం కోసం ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు జెడ్డాకు చేరుకున్నాయి. ద్రవిడ్‌తో పాటు ఆర్ఆర్ ఫ్రాంచైజీ యజమానులు అక్కడికి వెళ్లారు.
మెగా వేలంలో ఎవరిని దక్కించుకోవాలని చాలా సీరియస్ గా చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో ద్రవిడ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ను సైతం ఫాలో అవుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Tilak Varma : చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. టీ20ల్లో వరుసగా మూడో సెంచరీ..
ఈ వీడియోలో ఆర్ఆర్ టీమ్‌లోని ఓ సభ్యుడు ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయిందని అని చెప్పాడు. వెంటనే ద్రవిడ్ గట్టిగా.. అవునా.. ఆరు వికెట్లు పోయాయా.. ఎవరు ఔట్ అయ్యారు అని అడిగాడు. లబుషేన్ ఔట్ అయ్యాడు అని సదరు వ్యక్తి సమాధానం చెప్పాడు. ఆ వెంటనే మళ్లీ ద్రవిడ్ మాట్లాడుతూ.. ఎవరు అతడిని ఔట్ చేశారని అడుగగా సిరాజ్ అంటూ చెప్పాడు.
ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ టీమ్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దటీజ్ ద్రవిడ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కోచ్‌గా ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ టీమ్‌గురించే అతడు ఆలోచిస్తాడని అంటున్నారు.
IND vs AUS : 8, 10, 2, 0, 11, 6, 21, 3, 26, 5, 7 ఆసీస్ ఫోన్ నంబర్ చూశారా?
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత బౌలర్లు విజృంభించడంతో ఆస్ట్రేలియా 104 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు 46 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. హర్షిత్ రాణా మూడు వికెట్లు, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు.
Difficult to not keep up with scores when it’s Day 1 of the Border-Gavaskar Trophy 🇮🇳😂🔥 pic.twitter.com/d9qUdkZDoh
— Rajasthan Royals (@rajasthanroyals) November 22, 2024