Tilak Varma : చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. టీ20ల్లో వరుసగా మూడో సెంచరీ..
టీమ్ఇండియా యువ ఆటగాడు తిలక్ వర్మ అరుదైన ఘనత సాధించాడు

Tilak Varma slams third consecutive T20 hundred
టీమ్ఇండియా యువ ఆటగాడు తిలక్ వర్మ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో అతడు దీన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 67 బంతుల్లోనే 14 ఫోర్లు, 10 సిక్సర్లు బాది 151 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20ల్లో 150 ఫ్లస్ స్కోరు సాధించిన తొలి భారత ఆటగాడిగానూ రికార్డులకు ఎక్కాడు. గతంలో ఈ రికార్డు శ్రేయస్ అయ్యర్ (147) పేరిట ఉండేది.
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో హైదరాబాద్ తరుపున బరిలోకి దిగాడు తిలక్ వర్మ. మేఘాలయ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. బంతి పడిందే ఆలస్యం బౌండరీకి తరలించడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో28 బంతుల్లోనే అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత కూడా వేగంగా ఆడుతూ 51 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు.
IND vs AUS : 8, 10, 2, 0, 11, 6, 21, 3, 26, 5, 7 ఆసీస్ ఫోన్ నంబర్ చూశారా?
కాగా.. 10 రోజుల వ్యవధిలో టీ20ల్లో అతడికి ఇది మూడో శతకం. దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు, నాలుగో టీ20 మ్యాచుల్లో అతడు శతకాలను బాదిన సంగతి తెలిసిందే. తిలక్ భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ 248 పరుగులు చేసింది.
ఓవరాల్‌గా 22 ఏళ్ల తిలక్ 90 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 2950 పరుగులకు పైగా చేశాడు. ఇందులో నాలుగు శతకాలు ఉన్నాయి.
Rishabh Pant : చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. డబ్ల్యూటీసీలో ఒకే ఒక్క వికెట్ కీపర్..
🚨 3RD CONSECUTIVE HUNDRED IN T20 CRICKET FOR TILAK VARMA. 🚨
– TILAK SMASHED 151 (67) WITH 14 FOURS AND 10 SIXES IN SMAT…!!! 🤯🙇♂️ pic.twitter.com/HGFpwMpsp1
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 23, 2024