Rishabh Pant : చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. డబ్ల్యూటీసీలో ఒకే ఒక్క వికెట్ కీపర్..
టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత అందుకున్నాడు.

Pant creates history becomes first wicketkeeper to score 2000 runs in WTC
టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత అందుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిఫ్ (డబ్ల్యూటీసీ) చరిత్రలో 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో అతడు ఈ ఘనత అందుకున్నాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పంత్ 37 పరుగులు చేశాడు. ఈ పరుగులతో కలిపి డబ్ల్యూటీసీ పంత్ పరుగుల సంఖ్య 2034కి చేరింది. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ ఓలీ పోప్, న్యూజిలాండ్‌కు చెందిన టామ్ లాథమ్ ఇప్పటికే 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నారు. అయితే.. వీరు ఎక్కువగా వికెట్ కీపింగ్ చేయలేదు. ఓలీపోప్ కేవలం నాలుగు, టామ్ లాథమ్ ఒక్క ఇన్నింగ్స్‌లోనే వికెట్ కీపింగ్ చేశారు.
IPL Schedule : బీసీసీఐ కీలక నిర్ణయం.. ఒకేసారి మూడు ఐపీఎల్ సీజన్ల షెడ్యూల్ విడుదల!
2019లో డబ్ల్యూటీసీ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 2019-21, 2021-23 వరకు రెండు ఎడిషన్లు సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 2023-25 మూడో ఎడిషన్ నడుస్తోంది.
డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు..
ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
రోహిత్ శర్మ- 2685 పరుగులు
విరాట్ కోహ్లీ – 2432 పరుగులు
రిషబ్ పంత్ -2034 పరుగులు
శుభ్‌మన్ గిల్ – 1800 పరుగులు
ఛతేశ్వర్ పుజారా – 1769 పరుగులు
IND vs AUS : పంత్‌కే సాధ్యం.. కిందపడి మరీ సిక్సర్.. అలా ఎలా సామీ..
ఇక పెర్త్ మ్యాచ్ విషయానికి వస్తే.. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో నితీశ్ రెడ్డి (41), రిషబ్ పంత్ (37) టాప్ స్కోర్లర్లుగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ నాలుగు వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ లు తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 67/7 తో నిలిచింది.