IPL Schedule : బీసీసీఐ కీలక నిర్ణయం.. ఒకేసారి మూడు ఐపీఎల్ సీజన్ల షెడ్యూల్ విడుదల!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.

BCCI Announces Dates For Next Three IPL Editions
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఐపీఎల్ మూడు సీజన్లకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 14 నుంచి మే 25 వరకు, ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 15 నుంచి మే 31 వరకు , ఐపీఎల్ 2027 సీజన్ మార్చి 14 నుంచి మే 30 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఇలా ముందస్తుగా షెడ్యూల్‌ను విడుదల చేయడం వల్ల అంతర్జాతీయ మ్యాచుల షెడ్యూల్‌లో ఐపీఎల్‌కు స్థానం దక్కే అవకాశం ఉంటుంది.
IND vs AUS : పంత్‌కే సాధ్యం.. కిందపడి మరీ సిక్సర్.. అలా ఎలా సామీ..
జోఫ్రా ఆర్చర్ వచ్చేశాడు..
ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2025 మెగా వేలానికి అందుబాటులో ఉంటాడని క్రిక్‌బజ్ తెలిపింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో పాటు అతడు మూడు సీజన్లకు అందుబాటులో ఉంటాడని పేర్కొంది. దీన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. అతడు రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలో బరిలోకి దిగనున్నాడు.
575 ప్లేయర్‌గా ఆర్చర్ వేలంలోకి రానున్నాడు. అతడితో పాటు మరో ఇద్దరు కూడా వేలంలోకి యాడ్ అయ్యారు. అమెరికాకు చెందిన సౌరభ్ నేత్రావల్కర్ (576), భారత్‌కు చెందిన హార్దిక్ తమోర్ (577) వేలంలో షార్ట్ లిస్ట్ జాబితాలోకి చేర్చారు.
IND vs AUS : పెర్త్ టెస్టు.. చేతులెత్తేసిన బ్యాటర్లు.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 ఆలౌట్..
DATES FOR IPL FROM ESPN CRICINFO:
IPL 2025: March 14 – May 25.
IPL 2026: March 15 – May 31.
IPL 2027: March 14 – May 30. pic.twitter.com/Wx6sW7hl4U— Johns. (@CricCrazyJohns) November 22, 2024