EC Shock Janasena
Janasena symbol glass : జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కలిసి బరిలోకి దిగాలని భావిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఈసీ షాక్ ఇచ్చింది. జనసేన తన పార్టీ గుర్తుగా ప్రచారం చేసుకున్న గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దీంతో గాజు గ్లాస్ గుర్తు తమకు దక్కుతుందో లేదోనన్న ఆందోళన ఆ పార్టీలో నెలకొంది.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏదైనా రాజకీయ పార్టీ తన గుర్తును నిలుపుకోవాలంటే ఎన్నికల్లో నిర్ణీత ఓట్ల శాతాన్ని పొందాల్సివుంటుంది. జనసేన కొన్ని ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అతి తక్కువ స్థానాల్లో మాత్రమే పోటీ చేయడం లాంటి కారణాల వల్లే పార్టీ సింబల్ ను కోల్పోవాల్సి వచ్చిందని ఈసీ పేర్కొంది.
Pawan Kalyan : టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే పోటీ- పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
గతంలో ఏపీలోని బద్వేలు ఉప ఎన్నికలు, తిరుపతి లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాసు గుర్తును ఈసీ వేరే పార్టీ అభ్యర్థులకు కేటాయించింది. ఇప్పుడు తెలంగాణలోనూ జనసేన పార్టీ తన గుర్తును కోల్పోయింది.