election commission serves notices to ys sharmila over ys vivek case
YS Sharmila Reddy : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య ప్రస్తావన, వైసీపీ, అవినాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఈసీకి మల్లాది విష్ణు
ఫిర్యాదు చేశారు. తనకు శిక్ష పడలేదంటూ రాజకీయ ప్రయోజనాల కోసం షర్మిల పదేపదే తన గురించి ప్రస్తావిస్తున్నారని దస్తగిరి సైతం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
Read Also : CM Jagan : చంద్రబాబు పొడవమంటే సొంత తండ్రికే వెన్నుపోటు పొడిచేసింది- సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
మల్లాది విష్ణు, దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదును ఎన్నికల కమిషన్ పరిశీలించింది. వైఎస్ షర్మిల ఎన్నికల కోడ్ ఉల్లంగించినట్లు ఈసీ గుర్తించింది. 48 గంటల్లోగా ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని షర్మిలకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. అయితే, గడువులోగా వివరణ ఇవ్వని పక్షంలో ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికే, వైఎస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన నిర్ణయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసుపై ఎవరు మాట్లాడొద్దని ఆదేశాల్లో పేర్కొంది. ఎన్నికల వేళ విపక్షాలు వివేకా హత్య కేసు విషయంలో వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టు ఆశ్రయించారు. వివేకా హత్యపై ఎవరూ మాట్లాడొద్దని, షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, నారా లోకేష్‌కు సైతం కోర్టు కీలక సూచనలు చేసింది.
Read Also : Jagga Reddy : ఎవరి ఎమ్మెల్యేలు ఎవరితో టచ్‌లో ఉన్నారో ఎన్నికలయ్యాక తెలుస్తుంది- జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు