AP Municipal Results: ఏపీలో మున్సిపల్ ఫలితాలు నేడే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 23 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 353 డివిజన్‌, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. వీటిలో 28 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

AP Municipal Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 23 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 353 డివిజన్‌, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. వీటిలో 28 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 325 స్థానాలకు పోలింగ్‌ జరిగింది.

ఆయా స్థానాలకు వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన సహా వివిధ పార్టీలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కలిపి మొత్తం 12వందల 6 మంది బరిలో ఉన్నారు. 9వందల 8 పోలింగ్‌ కేంద్రాల్లో 8 లక్షల 62 వేల 66 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 29.. కమలాపురంలో 20వార్డులకు లెక్కింపు జరగనుంది. గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఒక వార్డు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 19 వార్డులకు, అటు గురజాలలోనూ ఆరు వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 14 వార్డుల కౌంటింగ్‌ జరపనున్నారు.

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో 20 వార్డులకు , ప్రకాశం జిల్లా దర్శిలో ఒక వార్డు ఏకగ్రీవం కాగా.. 19 వార్డులకు కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకవీడులో.. 20 వార్డులకు, అనంతపురం జిల్లా పెనుకొండలో.. 20 వార్డులకు, మరోవైపు కర్నూలు జిల్లా బేతం చెర్లలో.. 25 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వీటన్నింటి ఫలితాలు వెలువడనున్నాయి.

Gang Rape : స్నేహితులని నమ్మి వెళితే.. ఇద్దరమ్మాయిలపై గ్యాంగ్ రేప్

ట్రెండింగ్ వార్తలు