Amaravati Farmers : ముగిసిన అమరావతి రైతుల పాదయాత్ర..రేపు శ్రీవారిని దర్శించుకోనున్న అన్నదాతలు

అమరావతి రైతుల పాదయాత్ర ముగిసింది. అలిపిరి వద్దకు చేరుకున్న అమరావతి రైతులు..గరుడ విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి పాదయాత్ర ముగించారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరిట పాదయాత్ర చేశారు.

Amaravati Farmers’ Padayatra : అమరావతి రైతుల పాదయాత్ర ముగిసింది. అలిపిరి వద్దకు చేరుకున్న అమరావతి రైతులు….గరుడ విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి పాదయాత్ర ముగించారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరిట… నవంబర్ 1న అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. 44 రోజుల పాటు 400 కిలో మీటర్లకు పైగా పాదయాత్ర సాగింది. ఇవాళ సాయంత్రం రైతుల పాదయాత్ర.. అలిపిరి వద్దకు చేరుకుంది.

అమరావతి రైతులు రేపు కాలినడకన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అమరావతి రైతులకు రేపు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని టీటీడీ మంజూరు చేసింది. రేపు ఉదయం కాలినడకన అమరావతి రైతులు తిరుమల చేరుకోనున్నారు. పాదయాత్రలో పాల్గొన్న 500 మంది రైతులకు శ్రీవారి దర్శనం కల్పించాలని అన్నదాతులు విజ్ఞప్తి చేశారు. దీనిపై టీటీడీ సానుకూలంగా స్పందించింది. రేపు 500 మంది రైతులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం అవకాశం కల్పించింది.

Flexi Clash In Tirupati : అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత.. 3 రాజధానులు కావాలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చించివేత

అంతకముందు అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుపతిలో ఫ్లెక్సీల కలకలం రేపింది. మూడు రాజధానులే కావాలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని జనసేన, టీడీపీ నేతలు చించివేశారు. అమరావతి రైతులు పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో తిరుపతిలో ప్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న మార్గంలోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

‘మీతో మాకు గొడవలు వద్దు… మీకు మా స్వాగతం, మాకు మూడు రాజధానులే కావాలి’ అంటూ తిరుపతి ప్రజల పేరిట నగరంలో అర్ధరాత్రి ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అయితే మూడు రాజధానులు కావాలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని జనసేన, టీడీపీ నేతలు చించివేశారు. పాదయాత్రను నీరు గార్చేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరం నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు