Assistant Commissioner Shanthi : విశాఖ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని బదిలీ చేయాలి : ఉద్యోగులు

విశాఖ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి , ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదం ముదురుతోంది. వేధింపులకు పాల్పడుతున్న అసిస్టెంట్ కమిషనర్ శాంతిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

Shanthi (1)

Assistant Commissioner Shanthi : విశాఖ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి , ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదం ముదురుతోంది. ఈ వ్యవహారంపై ఆర్జేడీ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ మేరకు ఉద్యోగులు, ఈవోలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసిస్టెంట్ కమిషనర్ శాంతి తమను మానసికంగానే కాకుండా అన్నివిధాల వేధిస్తూ అవమానిస్తున్నారని తెలిపారు. ఈవో శ్రీనివాస రాజు తమకు టార్గెట్స్ పెట్టి హుండీల డబ్బులు అక్రమంగా తీసుకుంటున్నారని ఆరోపించారు.

కోర్టు వ్యవహారాల్లో లాయర్లకు ఇవ్వాల్సిన ఫీజులను తమతో వ్యక్తిగతంగా కట్టించుకుని అసిస్టెంట్ కమిషనర్ ప్రభుత్వం నుంచి డ్రా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. సొంత వాహనాలను ఆలయ సిబ్బంది వినియోగించుకొని, ప్రభుత్వం నుంచి డబ్బులు డ్రా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో డీసీపై శాంతి ఇసుక పోసిన రోజు కూడా తాము ఆర్జెడీకి ఈ విషయాలన్నీ చెప్పామని గుర్తు చేశారు. ఆ కోపంతో తామందరినీ మానసికంగా వేధిస్తూ అవమానాలకు గురిచేసిందని వాపోయారు.

VSP : డీసీ పుష్పవర్ధన్‌కు షాక్, ఏసీ శాంతికి అండగా ప్రభుత్వం

ప్రభుత్వం అనుమతించినా శాంతి తమ సెల్ ఫోన్స్ ను కూడా అనుమతించలేదన్నారు. వేధింపులకు పాల్పడుతున్న అసిస్టెంట్ కమిషనర్ శాంతిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఏసీ బదిలీ అయ్యే వరకు విధుల్లో చేరబోమని ఈవోలు, ఉద్యోగులు తేల్చి చెప్పారు.