VSP : డీసీ పుష్పవర్ధన్‌కు షాక్, ఏసీ శాంతికి అండగా ప్రభుత్వం

డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్, అసిస్టెంట్ కమిషనర్ శాంతి మధ్య ఇసుక యుద్ధంలో పుష్పవర్థన్‌కు ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

VSP : డీసీ పుష్పవర్ధన్‌కు షాక్, ఏసీ శాంతికి అండగా ప్రభుత్వం

Vsp

Visakhapatnam Endowment : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇసుక దుమారానికి తెరపడింది. డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్, అసిస్టెంట్ కమిషనర్ శాంతి మధ్య ఇసుక యుద్ధంలో పుష్పవర్థన్‌కు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దేవాదాయ శాఖ హెడ్ క్వార్టర్ట్స్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేయాలని ఆదేశాలు ఇస్తూనే.. విశాఖ ఎండోమెంట్‌లో ఏసీగా ఉన్న శాంతికి ప్రభుత్వం అండగా నిలిచింది.

Read More : Visakhapatnam : ఆఫీసులో డిప్యూటీ కమిషనర్‌‌పై మట్టి పోసిన మహిళా అధికారి..ఉసురు తగులుతుందంటూ..శాపనార్థాలు

నాశనం అయిపోతవాంటూ శాపనార్థాలు :-
దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్‌పై ఆఫీస్‌లోనే.. ఆగస్టు 5న అసిస్టెంట్ కమిషనర్ శాంతి దుమ్మెత్తి పోసింది. నాశనం అయిపోతావంటూ శాపనార్థాలు పెట్టింది. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై ఆర్జేసీ సురేశ్‌ బాబుతో మరుసటి రోజే విచారణకు ఆదేశించింది. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు.. ఆగస్టు 6న ఘటనపై విచారణ చేపట్టారు. అసిస్టెంట్‌ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్‌ను విడివిడిగా విచారించారు. ఘటనపై పూర్తి వివరాలతో నివేదికను ఆగస్టు 9న ప్రభుత్వానికి సమర్పించారు.

Read More : US : అప్ఘాన్‌లో అమెరికా మిషన్ కంప్లీట్

పుప్షవర్ధన్ డిమోషన్ :-
మరోవైపు.. ఆగస్టు 7వ తేదిన విజయనగరం వచ్చిన దేవదాయ శాఖ మంత్రిని కలిసిన ఏసీ శాంతి, మరికొంతమంది ఉద్యోగులు కలిసి తమ గోడు చెప్పుకున్నారు. ఆ తరువాత 12న దేవదాయ శాఖ కమీషనర్‌తో ఏసీ శాంతి, డీసీ పుష్పవర్థన్ భేటీ అయ్యారు. ఘటనపై పూర్తిగా విచారించిన ఉన్నతాధికారులు.. దుమ్మెత్తిపోయడంపై.. అసిస్టెంట్ కమిషనర్ శాంతి తప్పులేదని నిర్ధారించారు. పుష్పవర్థన్‌ను డిమోషన్ చేస్తూ ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ గా నియమించారు.

Read More : TRS : సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్, మూడు రోజులు అక్కడే

ఏడాదిన్నరగా విశాఖలో  :-
దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా శాంతి గత ఏడాదిన్నరగా విశాఖలో పని చేస్తున్నారు. ఇటీవల సింహాచలం, మాన్సాస్‌ ట్రస్ట్ వివాదాల వ్యవహారంపై.. ప్రభుత్వం పుష్పవర్థన్‌ను డీసీగా నియమించింది. అయితే.. దేవాదాయ శాఖ పరిధిలోని పలు దేవాలయాల్లోని హుండీ ఆదాయంలో అవకతవకలు జరిగాయని.. జులై 19న జ్ఞానాపురం శ్రీఎర్నిమాంబ దేవాలయ ఈవో, అనకాపల్లి ఇన్‌స్పెక్టర్‌ వీ.శ్రీనివాసరాజును డీసీ పుష్పవర్థన్ సస్పెండ్‌ చేసి.. 34 చార్జ్ లు నమోదు చేశారు.

Read More : Andhra Pradesh : 40 మంది డీఎస్పీలకు పదోన్నతి

ఘటనపై విచారణ :-
ఆ తర్వాత.. జులై 28న విశాఖ అర్బన్‌ ఇన్‌స్పెక్టర్, పలు ఆలయాల ఈవో మంగిపూడి శ్రీధర్‌ను ఏసీ శాంతి సస్పెండ్‌ చేసి 31 చార్జ్ లు నమోదు చేశారు. ఇక్కడే వారిద్దరికీ చెడినట్లు తెలుస్తోంది. తనకు అత్యంత నమ్మకస్తుడైన శ్రీనివాసరాజును డీసీ సస్పెండ్ చేయడంతో.. దానికి ప్రతిచర్యగానే ఏసీ వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. మొత్తం ఘటనపై విచారించిన ఉన్నతాధికారులు.. నివేదిక రిపోర్టు, శాంతి వాంగ్మూలం ఆధారంగా చర్యలు చేపట్టారు. డీసీ పుష్ఫవర్ధన్‌ను డిమోషన్ చేస్తూ.. హెడ్ ఆఫీసుకు రమ్మన్నారు. ఆయన స్థానంలో సింహచలం ఈవో సూర్య కళను నియమించారు.