YS Viveka Case : సీబీఐ కోర్టు ముందు హాజరైన ఎర్రగంగిరెడ్డి .. లొంగిపోతారా? పారిపోతారా?

మే 5లోపు లొంగిపోవాలని లేదంటే అరెస్ట్ చేయలని హైకోర్టు ఆదేశించింది. మరి ఈరోజు వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన ఎర్రగంగిరెడ్డి లొంగిపోతారా? లేదా పారిపోతారా?

YS Viveka case

YS Viveka Case : వైఎస్ వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు గంగిరెడ్డి మే5లోగా సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈరోజు మరోసారి సీబీఐ కోర్టులో వైఎస్ వివేక హత్య కేసు విచారణ జరగుతున్న క్రమంలో లో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరుఅయ్యారు. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ పై బయటే ఉన్నారు. ఈకేసులో కీలక పాత్ర ఉన్న ఎర్ర గంగిరెడ్డి బయట ఉండటంతో సాక్షులు భయపడుతున్నారని హైకోర్టుకు సీబీఐ తెలిపింది…అతని బెయిల్ రద్దు చేయాలని కోరింది. దీంతో అతని బెయిల్ ను రద్దు చేసిన హైకోర్టు మే కల్లా సీబీఐ కోర్టుముందు లొంగిపోవాలని ఆదేశిచింది. ఒకవేళ లొంగకపోతే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఈక్రమంలో సీబీఐ కోర్టుకు హాజరయ్యారు ఎర్రగంగిరెడ్డి. దీంతో ఎర్రగంగిరెడ్డితో పాటు ఇతర నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలను కోర్టులో హాజరుపరిచారు.

Erra Gangireddy Bail Cancel : వైఎస్ వివేక హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు

కాగా..వైఎస్ వివేకా హత్య కేసులోఏ1 నిందితుడగా ఉన్న ఎర్రగంగిరెడ్డి 2019 జూన్ 27న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. అప్పటినుంచి బయటే ఉన్నారు. గంగిరెడ్డి బెయిల్ కోసం వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డిలు గట్టిగా యత్నించినట్లుగా కూడా ఆరోపణలున్నాయి. ఈకేసు సిట్ దర్యాప్తులో ఉండగా సిట్ ఛార్జ్ షీట్ ను 90 రోజుల్లో దాఖలు చేయకపోవడంతో డీఫాల్ట్‌గా గంగిరెడ్డి బెయిల్‌ లభించటం జరిగింది. దీతో అతనిని విడుదల చేయాలని సీబీఐ కోర్టును ఆదేశించింది హైకోర్టు. అలా రూ.లక్షన్నర షూరిటీతో గంగిరెడ్డికి బెయిల్ మంజూరైంది. 2019లో వివేకా హత్య జరగ్గా.. ఈ కేసులో గంగిరెడ్డి అరెస్టు అవ్వటం..90 రోజుల్లోపు సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో జూన్ 27నే గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది పులివెందుల కోర్ట్.

ఈక్రమంలో అతని బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ కోరటంతో నిన్న గంగిరెడ్డి బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది. మే కల్లా లొంగిపోవాలని..లేకుంటే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన క్రమంలో సీబీఐ కోర్టుకు ఈరోజువిచారణ కోసం హాజరయ్యారు. మరి హైకోర్టు ఆదేశాలమేరకు లొంగిపోతారా? లేదా అరెస్ట్ అవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

YS viveka Case : వివేకానంద రెడ్డి హత్య గురించి ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వీడియో