Erra Gangireddy Bail Cancel : వైఎస్ వివేక హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు

2019 జూన్ 27న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. అయితే, ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ గతంలో సుప్రీంకోర్టు, తెలంగాణా కోర్టును ఆశ్రయించింది.

Erra Gangireddy Bail Cancel : వైఎస్ వివేక హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు

Erra Gangireddy Bail Cancel

Updated On : April 27, 2023 / 1:14 PM IST

Erra Gangireddy Bail Cancel : వైఎస్ వివేక హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే5లోగా సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. వైఎస్ వివేక హత్యలో ఎర్ర గంగిరెడ్డి కీలక పాత్ర పోషించారన్న ఆరోపణ ఉంది. ఎర్ర గంగిరెడ్డి బయట ఉండటంతో సాక్షులు భయపడుతున్నారని హైకోర్టుకు సీబీఐ తెలిపింది.

సీబీఐ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసింది. వైఎస్ వివేక హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి మొదటి నిందితుడిగా ఉన్నాడు. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి సాక్షాలు తారుమారు చేసిన కేసులో 2019 మార్చి 28న ఎర్ర గంగిరెడ్డి అరెస్టు అయ్యారు.

10Tv Exclusive: నాకేం తెలియదు.. రంగయ్య ఆరోపణలపై ఎర్ర గంగిరెడ్డి వ్యాఖ్యలు

కాగా, 2019 జూన్ 27న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. అయితే, ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ గతంలో సుప్రీంకోర్టు, తెలంగాణా కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన హైకోర్టు తాజాగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది.