ఏపీలో జిల్లాల పునర్ విభజనకు ప్రభుత్వం కమిటీని నియమించింది. సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కమిటీ వేశారు. 25 కొత్త జిల్లాల ఏర్పాటుకు వనరులు, తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయంన చేస్తుంది. ఈ కమిటీలో సభ్యులుగా సీసీఎల్ఏ కమిషనర్, జీఏడీ కార్యదర్శి, ప్రణాళికా శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ నియమించారు. మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్రంలోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని తద్వారా అభివృద్ధి అన్ని ప్రాంతాలకు అందే విధంగా చేస్తామని జగన్ ప్రకటించారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు ఇదివరకే చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేశారు.
ఇటీవల కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు పునర్ జిల్లాల ఏర్పాటు కోసం కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో సీఎస్ చైర్మన్ గా ఉంటారు. ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఉంటుంది. ష్ట్రంలోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేసేందుకు ఎటువంటి ప్రణాళిక తీసుకోవాలి.. ఎటువంటి మార్గదర్శకాలతో ముందుకు వెళ్లాల్సివుంటుందన్న దారిపై కమిటీ అధ్యయనం చేయనుంది. కమిటీ కన్వీనర్ గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఉంటారు. మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వనుంది. త్వరలో కమిటీ కార్యచరణతో ముంందుకు వెళ్లనుంది.