Ambati Rambabu : వంద మంది చంద్రబాబులు, పవన్ కళ్యాణ్ లు కలిసొచ్చినా గెలిచేది జగనే : మంత్రి అంబటి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి ఐదేళ్ల అధికారంలో ఎంత దోచుకున్నారో ప్రజలకు తెలుసన్నారు.

Minister Ambati Rambabu

Minister Ambati Rambabu : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. వంద మంది చంద్రబాబులు, పవన్ లు కలిసి వచ్చిన గెలిచేది జగనేనని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి ఐదేళ్ల అధికారంలో ఎంత దోచుకున్నారో ప్రజలకు తెలుసన్నారు. ”వై ఏపీ నీడ్స్ జగన్” కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో మంత్రి అంబటి రాంబాబు “గ్రామ నిద్ర” చేశారు.

ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీకి మద్దతు పలుకుతూ ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీతో కలిసి తిరుగుతున్నారని పేర్కొన్నారు. నీచ రాజకీయాలు చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Khalistani Terrorist Threat : ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు.. ఢిల్లీ, పంజాబ్ విమానాశ్రయాల్లో సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు

నైతిక విలువలు లేకుండా ప్రవర్తించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అనర్హుడని పేర్కొన్నారు. చంద్రబాబుపై అంబటి విమర్శలు చేశారు. దోచుకున్న చంద్రబాబు జైలుకు వెళ్లాడని తెలిపారు.