Khalistani Terrorist Threat : ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు.. ఢిల్లీ, పంజాబ్ విమానాశ్రయాల్లో సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు
నవంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఇండియాను దిగ్బంధిస్తామని చెప్పారు. ఆ రోజు ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించవద్దని, ఒక వేళ ప్రయాణిస్తే వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందని పన్నూన్ వీడియోలో పేర్కొన్నాడు.

Khalistani terrorist threat
Khalistani Terrorist Threat : నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించవద్దని ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత ఎస్ఎఫ్ జే సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చచరించిన విషయం తెలిసిందే. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ బెదిరింపుల నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్ విమానాశ్రయాల్లో సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, పంజాబ్‌లోని అన్ని విమానాశ్రయాలను నవంబర్ 30 వరకు తాత్కాలిక సందర్శకుల ప్రవేశ పాస్‌లను జారీ చేయవద్దని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశించినట్లు తెలుస్తోంది.నవంబర్ 19న ఎయిరిండియా విమానాలకు సంబంధించి ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరింపులు జారీ చేసిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
అయితే తాత్కాలిక విమానాశ్రయ ప్రవేశ పాస్‌లకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు ఉంటుందని తెలిపారు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాలనుకునే వ్యక్తుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని గత శనివారం విడుదల చేసిన ఒక వీడియోలో పన్నూన్ బెదిరించారు.
నవంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఇండియాను దిగ్బంధిస్తామని చెప్పారు. ఆ రోజు ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించవద్దని, ఒక వేళ ప్రయాణిస్తే వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందని పన్నూన్ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
Khalistani terrorist : భారత్‌కు ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్ సంచలన హెచ్చరిక
క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగే నవంబర్ 19న ఢిల్లీ విమానాశ్రయాన్ని మూసి వేస్తామని చెప్పారు. భవిష్యత్ లో ఢిల్లీ విమానాశ్రయం పేరు కూడా మారుస్తామని తెలిపారు. నిషేధిత యూఎస్ ఆధారిత ఎస్ఎఫ్ జే సంస్థకు చీఫ్‌గా ఉన్న పన్నూన్, 2019 నుండి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నిఘాలో ఉన్నారు.