Khalistani terrorist : భారత్‌కు ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్ సంచలన హెచ్చరిక
ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ భారతదేశానికి సంచలన హెచ్చరిక జారీ చేశారు. భారతదేశంపై తాము హమాస్ తరహా దాడి చేస్తామని ఉగ్రవాది పన్నూన్ బెదిరించారు....

Khalistani terrorist Pannun
Khalistani terrorist : ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ భారతదేశానికి సంచలన హెచ్చరిక జారీ చేశారు. భారతదేశంపై తాము హమాస్ తరహా దాడి చేస్తామని ఉగ్రవాది పన్నూన్ బెదిరించారు. నిషేధిత యూఎస్ ఆధారిత సిక్కుల జస్టిస్ సంస్థ చీఫ్ అయిన ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజాగా కొత్త వీడియోను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. పంజాబ్ విషయంలో భారత్ తీరు ఇలాగే కొనసాగితే దీనికి హమాస్ దాడి లాంటి ప్రతిస్పందన ఉంటుందని పన్నూన్ హెచ్చరించారు.
Also Read :Mexico : మెక్సికోను వణికిస్తున్న లిడియా హరికేన్
సిక్కుల దాడులకు ప్రధాని మోదీ బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. సిక్కుల జస్టిస్ సంస్థ ఓటును విశ్వసిస్తుందని పన్నూన్ వీడియోలో చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ పై దాడి చేస్తామని పన్నూన్ బెదిరించడంతో ఆయనపై అహ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు కెనడా దేశంలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు సిక్కుల సంస్థ ప్రతీకారం తీర్చుకుంటుందని పన్నూన్ హెచ్చరించారు.
Also Read :UP Cabinet expansion : నవరాత్రివేళ యూపీ మంత్రివర్గ విస్తరణ…కొత్తవారికి చోటు
అమృత్‌సర్‌లో జన్మించిన పన్నూన్ 2019వ సంవత్సరం నుంచి ఖలిస్తానీ ఉగ్రవాదిగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఇతనిపై మొదటి కేసు పెట్టినప్పటి నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ నిఘా వేసింది. పన్నూన్ పై 2021 వ సంవత్సరం ఫిబ్రవరి 3వతేదీన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 29వతేదీన అతన్ని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది.