Frontline Workers: ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు అండగా ఏపీ ప్రభుత్వం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన!

ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జూనియర్‌ డాక్టర్ల ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌ను నెరవేరుస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Ex gratia for frontline workers in Andrapradesh: ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జూనియర్‌ డాక్టర్ల ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌ను నెరవేరుస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

కోవిడ్‌ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ల కుటుంబానికి రూ.25 లక్షలు.. స్టాఫ్‌ నర్సుకి రూ.20 లక్షలు, MNO లేదా FNOలకు రూ.15లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఇతర వైద్య సిబ్బంది చనిపోతే రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకానికి అదనంగా ఈ ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు ఉత్తర్వులలో వెల్లడించింది. తక్షణమే ఎక్స్‌గ్రేషియా అందేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. జిల్లా కలెక్టర్లు సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించి ఎక్స్‌గ్రేషియా ఇచ్చేందుకు ఏర్పాట్లు చెయ్యాలని ప్రభుత్వం కోరింది.

గుర్తింపు కార్డుతో పాటు, కోవిడ్-19 పాజిటివ్ సర్టిఫికేట్ మరియు మరణ ధృవీకరణ పత్రం సమర్పించి ఈ ఎక్స్‌గ్రేషియాకు కుటుంబ సభ్యులు అప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ట్రెండింగ్ వార్తలు