Roja On Pawan Kalyan (Photo Credit : Google)
Roja : రాష్ట్రంలో అత్యాచార ఘటనలపై స్పందిస్తూ తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజకీయవర్గాల్లో చర్చకు దారితీశాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా స్పందించారు. శ్రీకాళహస్తిలో రోజా మాట్లాడారు. మహిళా హోంమంత్రి అనిత పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారని ధ్వజమెత్తారు. జగన్ ఇది వరకు చెప్పిన విషయాలే ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారని ఆమె అన్నారు.
”రాష్ట్రంలో బాలికలపై అత్యాచారాలు జరుగుతున్న విషయాన్ని స్వయంగా పవన్ కల్యాణ్ చెప్పారు. హోంమంత్రి విఫలమయ్యారని స్వయంగా ఉప ముఖ్యమంత్రి చెప్పారు. పవన్ కామెంట్స్ తో హోంమంత్రి రాజీనామా చేయాలి. సీఎం చంద్రబాబు కూడా రాజీనామా చేయాలని పవన్ డిమాండ్ చేయాలి. కుంభకర్ణుడు లాగా ఆరు నెలలకు ఒకసారి పవన్ మాట్లాడుతున్నారు. షూటింగ్ లు ముగించుకొని పవన్ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ గా ఉంటే పోలీసులు ఎందుకు పని చేయరు.
గత ఐదేళ్లలో బాలికలపై ఇలాంటి అఘాయిత్యాలు జరగలేదు. మీకు అనుకూలురైన పోలీసులను నియమించుకున్నారు. మరి ఎందుకు పని చేయడం లేదు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అధికారులతో సరిగా పని చేయించుకోవాల్సిన బాధ్యత సీఎం, ఉప ముఖ్యమంత్రిపై ఉంది. ప్రజలు వరదల్లో మునిగిపోతే పవన్ షూటింగ్ లో మునిగితేలారు. ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ ఫెయిల్యూర్. హోంమంత్రి అనిత మీద అన్నీ తోసేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఎవరినో బలిపశువు చేసి, డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని చూస్తే ఒప్పుకోము.
హోంమంత్రి విఫలం అయ్యారని మేము అంటే ఎగిరిపడ్డ అనిత.. ఇప్పుడు పవన్ కల్యాణ్ కామెంట్స్ పై ఏం చెబుతారు? ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. రాష్ట్రంలో నేరాలను నియంత్రించలేకపోతున్న సీఎం చంద్రబాబు కూడా రాజీనామా చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేయాలి. రాష్ట్రంలో పోలీసులను తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది” అని మాజీ మంత్రి రోజా అన్నారు.
Also Read : అందుకే, ఆయన అలా అన్నారు- పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత రియాక్షన్..