అందుకే, ఆయన అలా అన్నారు- పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత రియాక్షన్..

నేటికీ నేను సోషల్ మీడియా బాధితురాలినే.

అందుకే, ఆయన అలా అన్నారు- పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత రియాక్షన్..

Updated On : November 5, 2024 / 12:33 AM IST

Vangalapudi Anitha :  రాష్ట్రంలో అత్యాచార ఘటనలపై స్పందిస్తూ తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు. హోంమంత్రిగా నేను ఫెయిల్ అయ్యానని పవన్ కల్యాణ్ ఎక్కడా అనలేదని అనిత గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పాజిటివ్ గా తీసుకుంటున్నాను అని చెప్పారామె. పవన్ తో మాట్లాడి క్లారిటీ తీసుకున్నానని తెలిపారు.

”పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను కట్ చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో భయంకరమైన పోస్టులు వస్తున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అసభ్య మేసేజ్ లు పెడుతున్నారు. నాపైన, పవన్ కల్యాణ్ కూతుళ్లు, నారా బ్రాహ్మణి, భువనేశ్వరిలపై అనుచిత పోస్టింగ్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆవేదనతోనే పవన్ కల్యాణ్ అలా మాట్లాడారు. నేరాల విషయంలో అందరికీ బాధ ఉంది.

మేము మాట్లాడలేకపోతున్నాము. పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన బయటపడ్డారు, మేము పడలేదంతే. పవన్ వ్యాఖ్యలను బాధ్యతగా తీసుకుని పని చేస్తాను. నేటికీ నేను సోషల్ మీడియా బాధితురాలినే. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై జిల్లాల వారీగా సమీక్ష చేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నాము.

వైసీపీ పాలనలో పోలీసులు విధులు నిర్వహించేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. పోలీసు శాఖ నిర్లిప్తత నుంచి బయటకు రావాలి. గంజాయి మత్తులో ఉన్న వారు పోలీసులపై ఛాలెంజ్ చేసి వెళ్తున్నారు. గత రెండు రోజులుగా తిరుపతి, అనంతపురం జిల్లాల్లో రివ్యూ చేయడం జరిగింది. మహిళలు, చిన్న పిల్లలపై జరుగుతున్న దాడులపై రివ్యూ చేశాం. పోలీస్ అధికారులు నిర్లిప్తత నుండి బయటకు రావాలి. హిందూపురం గ్యాంగ్ రేప్ ఘటనకి సంబంధించి కొంత ఫెయిల్యూర్ కనిపిస్తుంది. గత ఐదేళ్లు పోలీస్ వ్యవస్థ నిర్లిప్తతగా ఉంది.

కొంతమంది సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్ లతో రెచ్చిపోయారు. గౌతు శిరీష, రంగనాయకమ్మ లాంటి వారిని సోషల్ మీడియాలో పోస్టుల పేరుతో CID పోలీసులు రాత్రివరకు స్టేషన్ లో ఉంచుకున్నారు. కూటమిలో ఏం జరుగుతుందో అని గోతి కాడ నక్కలా కాచుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టుల పేరుతో జరుగుతున్న వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ బాధతో మాట్లాడారు. నేను పవన్ కళ్యాణ్ మాటలను చాలా పాజిటివ్ గా తీసుకున్నా. పవన్ కల్యాణ్ తో ఫోన్ లో మాట్లాడినప్పుడు ఆయన క్లియర్ గా చెప్పారు. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా పకడ్బందీగా ఉన్నాం” అని హోంమంత్రి అనిత అన్నారు.

Also Read : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యల వెనక కారణమేంటి? పూర్తి వివరాలు..