Travels
Exploitation of Private Travels : పండగ సీజన్ మొదలైందో లేదో.. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ మొదలెట్టేశాయి. దసరా సీజన్ కావడంతో.. ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు స్టార్ట్ చేశాయి. అడ్డగోలుగా రేట్లు పెంచేసి.. అందిన కాడికి దండుకుంటున్నారు ట్రావెల్స్ నిర్వాహకులు. దసరా పండక్కి సొంత ఊరెళ్లాలని భావించే వారి జేబు గుల్ల చేస్తున్నారు. పండగ దోపిడీ షురూ చేసిన ప్రైవేట్ ట్రావెల్స్.. అదనపు చార్జీలతో ప్రయాణికులను దండుకునే పనిలో ఉన్నాయి.
విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చే ప్రత్యేక బస్ టికెట్‌పై 200శాతం రేట్లను పెంచేశాయి. వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు గరిష్టంగా మూడు వేలు వసూలు చేస్తున్నారు. విశాఖ నుంచి విజయవాడకు రెండు వేల నుంచి మూడు వేలు వసూలు చేస్తున్నారు. స్లీపర్, సీటింగ్ టికెట్లకు ఒకే చార్జీలు వసూలు చేస్తుండగా.. నాన్ ఏసీ కంటే ఏసీ బస్సులపై ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
TSRTC : దసరా పండగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
దసరా సీజన్ కావడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు స్టార్ట్ చేసేశాయి. టికెట్ ధరలు భారీగా పెంచేశాయి. దసరా పండక్కి ఊరెళ్లాలని చాలామంది అనుకుంటారు. ఇదే ప్రైవేటు ట్రావెల్ ఆపరేటర్లు ఇప్పటికే ధరలు పెంచేశారు. విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించడంతో ప్రైవేటు ట్రావెల్స్ వేల సంఖ్యలో సర్వీసులు సిద్ధం చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సుమారు 5 వేల వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడపనున్నట్లు తెలుస్తోంది.
రద్దీని బట్టి ప్రైవేటు ట్రావెల్స్ టికెట్ ధరను 125 శాతం పెంచాయి. పండగ దగ్గర పడే కొద్దీ అవి మరింత పెరుగుతాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖ నగరాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. విజయవాడకు ఏసీ స్లీపర్ బస్సుల్లో టికెట్ పదకొండు వందలు.. నాన్ ఏసీ స్లీపర్ ధర వెయ్యి రూపాయలుగా ఉంది.
Dussehra Celebrations : ఏపీలో అక్టోబర్ 7 నుంచి దసరా ఉత్సవాలు
వోల్వో అయితే 2 వేల వరకు ధర పలుకుతోంది. ఏసీ బస్సుల్లో సీటుకు వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో టికెట్ ధర ఐదు వందల నుంచి ఆరు వందలు ఉంటే.. పండగ పేరుతో రేట్లను డబుల్ చేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్.
టికెట్ల ధరలు పెంచకూడదు, అదనంగా చార్జీలు వసూలు చేయకూడదు, లేదంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నా ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం కేర్ చెయ్యడం లేదు. ప్రయాణికులను దొరికినకాడికి దోచుకోవడానికి రెడీ అయ్యాయి.