Andhra Pradesh : మందుబాబులకు గుడ్ న్యూస్.. సమయం పొడిగింపు
బేవరేజెస్ కార్పొరేషన్ దుకాణాలు సైతం రాత్రి 10 వరకు నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు 2022, జనవరి 17వ తేదీ సోమవారం ఏపీ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Liquor sales
Liquor Sales Time : ఏపీ రాష్ట్రంలోని మందుబాబులకు గుడ్ న్యూస్ వినిపించింది సర్కార్. మద్యం విక్రయించే దుకాణాల పని వేళలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 09 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేసే వారు. ఈ సమయాన్ని గంట పొడిగించింది. రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలు చేసుకోవచ్చని తెలిపింది. బేవరేజెస్ కార్పొరేషన్ దుకాణాలు సైతం రాత్రి 10 వరకు నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు 2022, జనవరి 17వ తేదీ సోమవారం ఏపీ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Read More :TS Covid Update : తెలంగాణలో ఈరోజు కొత్తగా 2,447 కోవిడ్ కేసులు
మద్యం విషయంలో ఏపీ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. ఇటీవలే…రాష్ట్రంలో మద్యంపై పన్ను రేట్లలో మార్పులు చేసింది. వ్యాట్‌తో పాటు స్పెషల్ మార్జిన్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని క్రమబద్ధీకరించింది. ఈ నిర్ణయంతో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌పై ఐదు నుంచి పన్నెండు శాతం.. ఇతర లిక్కర్ కేటగిరీలపై ఇరవై శాతం ధర తగ్గే అవకాశం కనిపిస్తోంది. అన్ని ప్రముఖ బ్రాండ్ల మద్యం అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మద్యం స్మగ్లింగ్ అరికట్టేందుకే.. ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మద్యం పన్నుల్లో మార్పుల ద్వారా వివిధ కేటగిరీల్లోని మద్యం ధరలు తగ్గే అవకాశం ఉంది. IMFLలో 400 వరకు కేసు ధర ఉన్న మద్యంపై 50 శాతం మేర వ్యాట్.. 36 శాతం మేర అదనపు ఎక్సైజు డ్యూటీ.. 90 శాతం మేర స్పెషల్ మార్జిన్‌లను క్రమబద్దీకరించింది ప్రభుత్వం.