Vallabhaneni Vamsi: ఇటీవలే జైలు నుంచి విడుదలైన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఆయనను కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వంశీకి చికిత్స అందిస్తున్నారు.
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరు కావడంతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ కొన్ని రోజుల క్రితమే విజయవాడ సబ్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఫిబ్రవరి 16న విజయవాడ పటమట పోలీసులు వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. బెదిరింపులు, కిడ్నాప్ కేసులో వంశీని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వంశీపై వరుసగా 11 కేసులు నమోదయ్యాయి. 140 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. అన్ని కేసుల్లోనూ బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు.
Also Read: ‘భూమి చుట్టూ తిరుగుతున్న ఏలియన్ శాటిలైట్..? 13000 సంవత్సరాలుగా..’ మనపై నిఘా పెట్టారా!?
2019 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారంటూ వంశీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ బెయిల్ కోసం నూజివీడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు జరిగాయి. అనంతరం కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. వంశీపై ఉన్న రెండు కేసుల్లో కూడా గత నెలలోనే బెయిల్ మంజూరైంది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులోనూ బెయిల్ రావడంతో జూలై 2న వంశీ జైలు నుంచి విడుదలయ్యారు.