Farmer Idea : ఎండ పడకుండా అరటిమొక్కకు గొడుగు.. రైతు ఐడియా అదుర్స్

ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయంటే.. అన్నీ మలమల మాడిపోతున్నాయి. ఈ క్రమంలో ఎండల నుంచి కాపాడుకునేందుకు మనుషులు గొడుగులు, క్యాపులు వినియోగిస్తున్నారు. మరి మొక్కల పరిస్థితి ఏంటి? ఎండలకు మలమల మాడాల్సిందేనా? ఎండల ధాటికి అవి బతికే అవకాశం లేదా? ఈ ప్రశ్నలకు ఆ రైతు వినూత్నంగా సమాధానం చెప్పాడు.

Farmer Idea : ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భూమి నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఠారెత్తించే ఎండల ధాటికి మనుషులు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 10 దాటితే చాలు ఇంట్లో నుంచి బయటకు వచ్చే సాహసం కూడా చెయ్యలేకపోతున్నారు. అంతలా ఎండలు మండిపోతున్నాయి. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. మిగతా వాటి సంగతి చెప్పక్కర్లేదు.

ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయంటే.. అన్నీ మలమల మాడిపోతున్నాయి. ఈ క్రమంలో ఎండల నుంచి కాపాడుకునేందుకు మనుషులు గొడుగులు, క్యాపులు వినియోగిస్తున్నారు. మరి మొక్కల పరిస్థితి ఏంటి? ఎండలకు మలమల మాడాల్సిందేనా? ఎండల ధాటికి అవి బతికే అవకాశం లేదా? ఈ ప్రశ్నలకు ఆ రైతు వినూత్నంగా సమాధానం చెప్పాడు. అరటి మొక్కలను కాపాడుకోవడానికి డిఫరెంట్ గా ట్రై చేశాడు. ఆ మొక్కలకు గొడుగులు ఏర్పాటు చేశాడు. ఇంతకీ ఎలాంటి గొడుగులు ఏర్పాటు చేశాడంటే..

కడప జిల్లా కొండాపురం మండల పరిధిలోని తిమ్మాపురం రైతు కొండారెడ్డి ఎండలకు అరటి మొక్కలు బెట్టకు గురికాకుండా ఈతాకు కొమ్మలతో గొడుగుల్లా ఏర్పాటు చేసి బతికించుకుంటున్నాడు. ఈతాకు కొమ్మలను గొడుగుల్లా ఏర్పాటు చేయడం ద్వారా మొక్కపై నేరుగా ఎండపడదు. గాలి వెలుతురు మాత్రం ఉంటుంది. దీంతో మొక్కలు బతుకుతాయని ఆయన చెబుతున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మండలంలో ఇటీవల అరటిపంట సాగు చేశారు. ఎండల నుంచి కాపాడుకునేందుకు ఇలా గొడుగులు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో వెళ్లే వారంతా ఆసక్తిగా చూస్తున్నారు. రైతు ఆలోచన వినూత్నంగా ఉందని ప్రశంసిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు