Nellore Fire Accident: నెల్లూరు కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం.. ఘటనపై అనుమానాలు?

అప్పట్లో కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన పలు ఫైల్లు దగ్ధమయ్యాయి. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. కలెక్టరేట్‌కు చేరుకుని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ ప్రమాద ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Nellore Fire Accident: నెల్లూరు కలెక్టరేట్‌లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. కలెక్టరేట్ వెనుకవైపు ఉన్న స్టోర్ రూమ్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో గత ఎలక్షన్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్, ఫర్నీచర్, పాత సామగ్రి దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో కొన్ని కీలక ఫైళ్లు కూడా కాలిపోయాయి.

Hyderabad E-Race: హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫార్ములా ఈ-రేస్.. సచిన్, రామ్ చరణ్ సహా సినీ తారలు హాజరు

అప్పట్లో కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన పలు ఫైల్లు దగ్ధమయ్యాయి. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. కలెక్టరేట్‌కు చేరుకుని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ ప్రమాద ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదంలో కీలక ఫైళ్లు దగ్ధం కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రమాద ఘటన రెండో శనివారం జరగడం, ఈ రోజు సెలవు దినం కావడంతో సిబ్బంది ఎవరూ లేరు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఇక ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాలి. ఈ ప్రమాద ఘటనకు గల కారణాలు తెలియరాలేదు.