Firecrackers Explosion
Firecrackers Explosion: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అమలాపురం పట్టణం రావులచెరువులోని బాణసంచా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాణాసంచా పలుడు దాటికి రెండు అంతస్తుల భవనం ధ్వంసమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురికి తీవ్ర గాయాలుకాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం కొందరిని కిమ్స్ కు తరలించారు.
Also Read : Jammu and Kashmir : బారాముల్లా ఎన్‌కౌంటర్.. ఆర్మీ కాల్పులతో పారిపోతున్న ఉగ్రవాది వీడియోలు వైరల్..
దీపావళి మందు గుండు సామాగ్రికి తయారీలో వినియోగించే మందుతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అమలాపురం పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఘటనా స్థలిని జిల్లా ఎస్పీ కృష్ణారావు పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే అయితబత్తుల ఆనందరావు ఘటన స్థలికి చేరుకొని స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఇదిలాఉంటే.. పేలుడుదాటికి స్థానిక ప్రజలు భయబ్రాంతలకు గురయ్యారు.