Jammu and Kashmir : బారాముల్లా ఎన్‌కౌంటర్.. ఆర్మీ కాల్పులతో పారిపోతున్న ఉగ్రవాది వీడియోలు వైరల్..

బారాముల్లా చాక్ తాప్పర్ క్రెరీలో శనివారం రాత్రి జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో భద్రతా దళాలులు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఉగ్రవాదుల నుంచి భారీ ఆయుధాలు,

Jammu and Kashmir : బారాముల్లా ఎన్‌కౌంటర్.. ఆర్మీ కాల్పులతో పారిపోతున్న ఉగ్రవాది వీడియోలు వైరల్..

Terrorist

Updated On : September 16, 2024 / 12:43 PM IST

Baramulla Encounter Drone Video : జమ్మూ కాశ్మీర్ లోని బురాముల్లాలో శనివారం భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ప్రకారం.. భారత్ సైన్యం కాల్పులు జరుపుతున్న సమయంలో ఓ ఉగ్రవాది భవనం నుంచి బయటకు వచ్చాడు. సైన్యం కాల్పుల నుంచి తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు కిందపడిపోయాడు. సైన్యం కాల్పుల తీవ్రతను పెంచడంతో లేచి పక్కనే ఉన్న పొదల్లో గోడచాటుకు వెళ్లి దాక్కున్నాడు. సైన్యం ఆ దిశగా తూటాల వర్షం కురిపించడం స్పష్టంగా వీడియోలో కనిపించింది.

Also Read : Jammu kashmir Encounter : ప్రధాని మోదీ పర్యటనకు ముందు జమ్మూలో ఉగ్ర కలకలం.. ఇద్దరు జవాన్లు మృతి

బారాముల్లా చాక్ తాప్పర్ క్రెరీలో శనివారం రాత్రి జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో భద్రతా దళాలులు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఉగ్రవాదుల నుంచి భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సైనికులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో స్థానికులకు ఎలాంటి గాయాలు కాలేదని, ఆస్తి నష్టం జరగలేదని తెలిపారు. జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్ వైపు నుంచి ఉగ్రప్రయత్నాలు తీవ్రమయ్యాయి. గత వారం రోజుల్లో మూడు సార్లు ఉగ్ర చొరబాట్లకు యత్నాలు జరిగాయి. జమ్మూకశ్మీర్ లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. తొలివిడత పోలింగ్ సెప్టెంబర్ 18న జరగనుంది.