ఉప్పాడలో మూడు రోజులుగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సముద్రపు అలలు

పలువురి మత్స్యకార గృహాలు నేలమట్టం అయ్యాయి. సముద్రపు అలలు మూడు రోజులుగా

‘రెమాల్’ తుపాను మరింతగా బలపడి తీవ్ర తుపానుగా మారిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో ఉప్పాడ బీచ్ అలల తీవ్రత అధికంగా ఉంది. ఉప్పాడలో మూడో రోజు కూడా అలల ఉద్ధృతి ఆగడం లేదు. కెరటాలు ఇళ్లల్లోకి దూసుకువచ్చాయి.

పలువురి మత్స్యకార గృహాలు నేలమట్టం అయ్యాయి. సముద్రపు అలలు మూడు రోజులుగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు రాకాసి అలలు ఎగిసిపడ్డాయి.

ఆదివారం నామమాత్రంగా అధికారులు బీచ్ రోడ్డు మూసివేశారు. అయితే, ఇవాళ తెల్లవారుజామున యథావిధిగా వదిలేయడంతో బీచ్‌లో ప్రజలు ప్రయాణం కొనసాగించారు. ఉప్పాడ- కాకినాడ ప్రయాణించే ప్రయాణికులపై సముద్రం విరుచుకుపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

సూరాడ పేట, మాయాపట్నంలో గతంలో వేసిన జియో ట్యూబ్ గట్టు పూర్తిగా ధ్వంసం అయింది. తీర ప్రాంతంలో సుమారుగా 10 ఇళ్లు ధ్వంసమయ్యాయి. తీర ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్నామని, తమను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.

Also Read: కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని అంటున్నారు: సామ రామ్మోహన్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు