Junior NTR Flexies : కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఒంగోలులో ఫ్లెక్సీలు.. వైసీపీ పనేనని అనుమానిస్తున్న టీడీపీ

మూడు ప్రాంతాల్లో ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు తొలగించాయి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారు ఎవరనే దానిపై టీడీపీ నాయకులు ఆరా తీస్తున్నారు. ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వ్యక్తుల కదలికలు సీసీ పుటేజీల్లో రికార్డు అయ్యాయి.

Junior NTR Flexies

Ongole Junior NTR Flexies : ప్రకాశం జిల్లా ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పట్టణంలోని చర్చీ సెంటర్, అద్దంకి బస్టాండ్, కర్నూలు రోడ్డు ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలు, సైకిల్ గుర్తు ఉన్నాయి.

జులై 21, 22 తేదీల్లో ఒంగోలు నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేయనున్న క్రమంలో ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. నారా లోకేష్ బుధవారం నుండి యువగళం పాదయాత్ర జరుగనున్న కనిగిరి, ఒంగోలు, దర్శి ప్రాంతాల్లో సేమ్ ఫ్లెక్సీలు వెలిశాయి.

Ramagundam BRS : బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు.. రెబల్స్ గా పని చేస్తున్నారంటూ ఆరుగురిని బహిష్కరించాలని తీర్మానం

అయితే, ఇది వైసీపీ పనేననీ టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. మూడు ప్రాంతాల్లో ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు తొలగించాయి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారు ఎవరనే దానిపై టీడీపీ నాయకులు ఆరా తీస్తున్నారు. ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వ్యక్తుల కదలికలు సీసీ పుటేజీల్లో రికార్డు అయ్యాయి.

ఒంగోలులో అర్ధరాత్రి వేల ఓ టాటా ఏసీలో ముఖానికి గంతలు కట్టుకుని ఎవ్వరూ గుర్తించకుండా ఫ్లెక్సీలు కట్టిన యువకులు జాగ్రత్త పడ్డారు. వాహనంలో నుండి ప్లెక్సీలు దింపుతున్న సన్నివేశాలు సీసీ పుటేజీల్లో లభ్యమయ్యాయి. సమీపంలోని ఓ పూలకొట్టు దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో దృష్యాలు రికార్డ్ అయ్యాయి.