Ramagundam BRS : బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు.. రెబల్స్ గా పని చేస్తున్నారంటూ ఆరుగురిని బహిష్కరించాలని తీర్మానం
జెడ్పీటీసీ సంధ్య రాణి, టీబీజీ కేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మి నారాయణ, కార్పొరేటర్ పాతపెల్లి లక్ష్మీ, నాయకులు ఎల్లయ్య, బయ్యపు మనోహర్ రెడ్డిలపై వేటు వేయాలని నిర్ణయించారు.

Ramagundam BRS
BRS Internal Differences : పెద్దపల్లి జిల్లాలో రామగుండం పాలిటిక్స్ పొలిటికల్ హీట్ పెంచుతోంది. బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీలో ఉంటూ రెబల్స్ గా పని చేస్తున్నారంటూ ఆరుగురిని బహిష్కరించాలని తీర్మానం చేశారు. ఎమ్మెల్యే చందర్ అధ్వర్యంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
జెడ్పీటీసీ సంధ్య రాణి, టీబీజీ కేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మి నారాయణ, కార్పొరేటర్ పాతపెల్లి లక్ష్మీ, నాయకులు ఎల్లయ్య, బయ్యపు మనోహర్ రెడ్డిలపై వేటు వేయాలని నిర్ణయించారు.
CM Jagan : జగనన్న తోడు పథకం నిధులు.. విడుదల చేయనున్న సీఎం జగన్
కాగా, రెబల్స్ టీమ్ మాత్రం అధిష్టానం వద్ద తేల్చుకుంటామంటోంది. అయితే అధిష్టానం రాజీ కుదురుస్తుందా? వేటు వేస్తోందా అనేది ఆసక్తిగా మారింది.