Leopard Trapped: తిరుమలలో పట్టుబడిన మూడు చిరుతల్లో బాలికపై దాడిచేసిన చిరుత ఏది? అధికారులు ఏం చెప్పారంటే..

చిన్నారి లక్షితపై మూడు చిరుతల్లో ఏ చిరుత దాడిచేసిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. లక్షితపై దాడి ఘటన తరువాత బోనులో చిక్కిన రెండు చిరుతల నమూనాలను ముంబైలోని ల్యాబ్‌కు అధికారులు పంపించారు.

leopard Operation

Cheetah In Tirumala: తిరుమల నడకదారిలో టీటీడీ, అటవీశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ చిరుత’ సక్సెస్ అయింది. ఎట్టకేలకు బోనులో నాలుగో చిరుత చిక్కింది. తిరుమల కాలినడక మార్గంలో వారం రోజులుగా చిరుతను బోనులో బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు. చిరుతను బంధించేందుకు పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. అయితే, చిరుత పులి బోను వద్దకు వచ్చినట్లే వచ్చి వెనుదిరిగిపోతుంది. ఎట్టకేలకు సోమవారం తెల్లవారు జామున కాలినడక మార్గంలో 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత పులి చిక్కింది. దీంతో అధికారులు, భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా బోనులో చిక్కుకున్న చిరుతతో రెండు నెలల్లో నాలుగు చిరుతలను అధికారులు బంధించారు.

Leopard Trapped: బోనులో చిక్కిన నాలుగో చిరుత.. తిరుమల నడకదారిలో ముగిసిన ‘ఆపరేషన్ చిరుత’

ఈ నెల 11న తిరుమలకు కాలినడక మార్గంలో వెళ్తున్న సమయంలో లక్షిత అనే ఆరేళ్ల చిన్నారిపై చిరుతపులి దాడిచేసి హతమార్చింది. అప్రమత్తమైన టీటీడీ అధికారులు అటవీశాఖ అధికారుల సహాయంతో చిరుతను బంధించేందుకు బోనులు ఏర్పాటు చేశారు. కాలినడక మార్గంలో మూడు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. మోకాలిమిట్ట, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లు ఉంచారు. దీంతో, ఈనెల 14న, 17వ తేదీన రెండు చిరుతలు బోనులో చిక్కాయి. తాజాగా కాలినడక మార్గంలో 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. గతనెల (జూన్) 24న అధికారులు ఒక చిరుతను బంధించారు. ఈ నాలుగు చిరుతలను అధికారులు జూ క్వారంటైన్‌లో ఉంచారు.

Leopard Trapped : తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత .. 50రోజుల వ్యవధిలో మూడు చిరుతలు..

చిన్నారి లక్షితపై మూడు చిరుతల్లో ఏ చిరుత దాడిచేసిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. లక్షితపై దాడి ఘటన తరువాత బోనులో చిక్కిన రెండు చిరుతల నమూనాలను ముంబైలోని ల్యాబ్‌కు అధికారులు పంపించారు. ఈ విషయంపై అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటివ్‌ ఆఫీసర్‌ (సీసీఎఫ్‌వో) నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సోమవారం తెల్లవారు జామున బోనులో చిక్కిన చిరుతను తిరుపతి జూ పార్క్‌కు తరలించినట్లు తెలిపారు. చిరుత రక్త నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. జూ క్వారంటైన్ లో ఇటీవల పట్టుబడిన రెండు చిరుతలు ఉన్నాయని, బాలిక రక్షితపై దాడి చేసింది ఏ చిరుత అనేది ఇంకా తెలియలేదని, ఏ చిరుత దాడి చేసిందో వైద్య పరీక్షల నివేదికలో తెలుస్తుందని  అన్నారు.  తిరుమల నడకమార్గాల్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోందని, వన్యప్రాణుల జాడల కోసం 300 కెమెరాలతో నిరంతరం అన్వేషణను కొనసాగిస్తున్నామని తెలిపారు. కాలిబాటలో శాశ్వతంగా 500 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి వన్య ప్రాణుల కదలికలను ఏప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని సీసీఎఫ్‌వో నాగేశ్వరరావు చెప్పారు.