ఆ క్రెడిట్ మొత్తం జగన్‌దే.. చంద్రబాబు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు : మాజీ మంత్రి అమర్నాథ్

ఇంట్లో ఎంతమంది చదివితే అంత మందికి తల్లి వందనం రూ.15000 ఇస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడేమో ఒకరికే ఇస్తాం అన్నట్లు జీవో ఇచ్చారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

Former Minister Gudivada Amarnath

Gudivada Amarnath : నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రకు ఏమి చెయ్యకుండా ఇప్పుడు చవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇన్నాళ్లు చంద్రబాబు ఒక ప్రాంతానికే పరిమితమై పరిపాలన కొనసాగించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు కావాల్సిన అనుమతులన్నీ జగన్ తీసుకొచ్చి పనులు మొదలు పెడితే.. ఇప్పుడు వచ్చి నేనే అన్నీచేసినట్లు చంద్రబాబు మాట్లాడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అమర్నాథ్ అన్నారు. ఏమీ చెయ్యకుండా అన్నితనే చేసినట్లు చెప్పుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.

Also Read : బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ‘ఆధార్ కార్డ్’ వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ నేతలు ఆగ్రహం

చంద్రబాబుకి ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ దేశంలో ఎవరికి ఉండవు. గతంలో 14సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు ఎప్పుడైనా పోర్ట్ లు, మెడికల్ కాలేజీలు కట్టించారా.. అంటూ మాజీ మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమాలన్నీ మేముచేస్తే ఇప్పుడేమో జగన్ ఏమి చెయ్యలేదని చంద్రబాబు చిత్రీకరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మేము మొదలు పెట్టిన పనులు చంద్రబాబు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. బీపీసీఎల్ ప్రాజెక్ట్ కి మేము అధికారంలో వున్నప్పుడే అడుగులు పడ్డాయి. అధికారులు వచ్చి మన రాష్ట్రంలో పర్యటన చేశారు. ఇప్పుడేమో చంద్రబాబు వచ్చాక బీపీసీఎల్ ప్రాజెక్ట్ వస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాకే పరిశ్రమలు వస్తున్నట్లు పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. ఏం చెయ్యకుండా అన్ని చేస్తున్నట్లు పబ్లిసిటీ చేసుకోవడంలో చంద్రబాబు దిట్ట అంటూ అమర్నాథ్ విమర్శించారు.

Also Read : బీచ్‌లో ఈతకొడుతూ 80కి.మీ సముద్రంలోకి కొట్టుకుపోయిన యువతి.. 37గంటల తరువాత ఏం జరిగిందంటే?

ఇంట్లో ఎంతమంది చదివితే అంత మందికి తల్లి వందనం రూ.15000 ఇస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడేమో ఒకరికే ఇస్తాం అన్నట్లు జీవో ఇచ్చారు. ఒక తల్లికే రూ.15000 ఇస్తే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు తల్లులు ఉండాలా? అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు. ఇసుక ఫ్రీ అన్నారు. డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. వాలంటీర్లు పరిస్థి ఏంటో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  చంద్రబాబు అధికారంలోకి వచ్చి 30 రోజులు అయ్యింది. అప్పుడే ప్రజల్ని మోసం చెయ్యడం మొదలుపెట్టేశారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. గడిచిన నెల రోజుల నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు మీద దాడులు చాలా ఆందోళన కలిగిస్తుంది. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా మీద కూడా దాడులు చెయ్యడం చాలా దారుణం అంటూ అమర్నాథ్ అన్నారు.