Vangaveeti Radha Krishna : పెళ్లి పీటలెక్కనున్న వంగవీటి రాధాకృష్ణ.. అమ్మాయి ఎవరంటే..
వంగవీటి రాధా కృష్ణ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. త్వరలోనే ఓ ఇంటివారు కానున్నారు. వంగవీటి రాధా.. పెళ్ళి ఫిక్స్ అయ్యింది. ఆయనకు త్వరలోనే నిశ్చితార్థం జరగనుంది. ఇంత కరీష్మా ఉన్న నాయకుడు వివాహం చేసుకునే అమ్మాయి ఎవరు? అనే ఆసక్తి ఉండనేఉంటుంది.మరి ఆ అమ్మాయి ఎవరంటే..
- nagamani
- Updated on- August 17, 2023 / 11:35 AM IST
Vangaveeti Radha Krishna Wedding
Vangaveeti Radha Krishna marriage : వంగవీటి రాధా కృష్ణ.. కాపు ఉద్యమ నేత వంగవీటి మోహన రంగా కుమారుడు. ఏపీ రాజకీయాల్లో మరి ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో కీలక నేత. రాధా.. పెళ్ళి గురించి ఆయన అభిమానులు ఎప్పుడు ఆసక్తి చూపిస్తుంటారు. రాధన్నా పెళ్లి ఎప్పుడు అంటూ సన్నిహితులు అడుగుతుంటారు. కానీ ఆయన మాత్రం నవ్వి ఊరుకునేవారట. అటువంటి వంగవీటి రాధా కృష్ణ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఆయనకు త్వరలోనే నిశ్చితార్థం జరగనుంది. ఇంత చరిష్మా ఉన్న నాయకుడు వివాహం చేసుకునే అమ్మాయి ఎవరు? అనే ఆసక్తి ఉండనే ఉంటుంది. మరి ఆ అమ్మాయి ఎవరు?
వంగవీటి రాధా కృష్ణ.. గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీ పాలిటిక్స్ లో కీలక నేత.. పొలిటికల్ లీడర్ అయిన రాధా.. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారని ఆయన అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇక ఆయన పెళ్లి పీటలు ఎక్కనున్నారని తెలిసి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. పెళ్లికి ముందు నిశ్చితార్థం వేడుక కూడా త్వరలోనే జరగనుందట. వచ్చే ఎన్నికలలోపే రాధా ఒకింటివారు కానున్నారు. అంటే సెప్టెంబర్ 6న రాధా వివాహం జరుగనుంది.
పొలిటికల్ చరిష్మా ఉన్న రాధాకు కాబోయే భార్య ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంకు చెందిన అమ్మాయి. నర్సాపురం పట్టణానికి చెందిన పుష్పవల్లితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైంది. తన మిత్రుడికి దగ్గర బంధువుల అమ్మాయితో ఈ వివాహం నిశ్చయం అయినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 19న నర్సాపురంలో ఎంగేజ్మెంట్ జరుగుతుందని.. సెప్టెంబర్ 6న వివాహం ముహూర్తం ఖరారు చేశారని తెలుస్తోంది.
కాగా వంగవీటి మోహన్ రంగా కుమారుడుగా వంగవీటి రాధా తనదైన శైలిలోనే రాజకీయాల్లో రాణిస్తున్నారు. 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నా మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు అదృష్టం కలిసిరాలేదనే చెప్పాలి. కానీ వచ్చే ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో రాధాకు టైమ్ కలిసి వస్తుందని.. ఇక వివాహం కూడా చేసుకోబోతున్నారు కాబట్టి ఆయన టైమ్ ఇంకా బాగుంటుందని.. ఈసారి ఎన్నికల్లో రాధా గెలుస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు. కాగా రాధా టీడీపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీకి దిగాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
